|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 02:34 PM
దేశ వైమానిక రంగం విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు సెంట్రల్ అనుమతి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.3.25 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్లు సమాచారం. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఇందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.ఈ ఒప్పందం కేవలం విమానాల కొనుగోలుకే పరిమితం కాదు. ఇందులో భాగంగా దాదాపు 100 యుద్ధ విమానాలను "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం కింద దేశీయంగానే తయారు చేయనున్నారు. అత్యాధునిక ఫైటర్ జెట్ టెక్నాలజీ బదిలీతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే నిబంధనలు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ డీల్ ఖరారైతే ఫ్రాన్స్ తర్వాత రఫేల్ యుద్ధ విమానాలను అత్యధిక సంఖ్యలో వినియోగిస్తున్న దేశాలలో ఒకటిగా భారత్ నిలుస్తుంది.
Latest News