|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 03:12 PM
కర్ణాటక రాష్ట్రానికి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ పునరుద్ఘాటించారు. కర్ణాటకలో గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ సాగుతోంది. ఈరోజు ఇక్బాల్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం శివకుమార్ చేసిన కృషికి ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని చాలామంది ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారని అన్నారు.కర్ణాటకలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 140 మంది ఎమ్మెల్యేలు మార్పును ఆశిస్తున్నారని, 80 నుంచి 90 వరకు ఎమ్మెల్యేలు ఈ అంశంపై చర్చించుకుంటున్నారని అన్నారు. తామంతా శివకుమార్‌కు మద్దతిస్తున్నామని అన్నారు.
Latest News