|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 03:14 PM
భారత సరిహద్దుల్లో ముళ్ల కంచెకు వేలాడదీసిన గాజు సీసాలు సైనికులకు 'దేశీ అలారం'గా పనిచేస్తున్నాయి. హైటెక్ సెన్సార్లు, సీసీ కెమెరాలు పనిచేయని చోట్ల ఈ సీసాలు 24 గంటలు, ఎలాంటి వాతావరణంలోనైనా సమర్థవంతంగా పనిచేస్తాయి. చొరబాటుదారులు లేదా వన్యమృగాలు కంచెను తాకితే వచ్చే 'టన్ టన్' శబ్దం సైనికులను అప్రమత్తం చేస్తుంది. లక్షల ఖరీదైన పరికరాలతో పోలిస్తే ఇది చాలా చవకైన, సమర్థవంతమైన పద్ధతి.జవాన్లు ఈ ఖాళీ సీసాలను ఒకదానికొకటి దగ్గరగా ఉండేలా ముళ్ల కంచెకు తాడుతో కడతారు. చీకట్లో ఎవరైనా చొరబాటుదారులు, ఉగ్రవాదులు లేదా వన్యమృగాలు కంచెను తాకినా, దాటేందుకు ప్రయత్నించినా.. తీగలు కదిలి ఈ సీసాలు ఒకదానికొకటి ఢీకొంటాయి. ఆ సమయంలో వచ్చే 'టన్ టన్' అనే శబ్దం రాత్రి నిశబ్దంలో చాలా దూరం వరకు వినిపిస్తుంది. ఈ శబ్దం వినగానే పెట్రోలింగ్ చేస్తున్న జవాన్లు వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకుంటారు.ఖర్చు తక్కువ.. పనితనం ఎక్కువ: లక్షల రూపాయల ఖరీదైన థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, లేజర్ అలారాలతో పోలిస్తే ఈ విధానం చాలా చవకైనది. ఖాళీ సీసాలు సులభంగా దొరుకుతాయి. వీటిని ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి పెద్దగా ఖర్చు ఉండదు. అందుకే సాంకేతికత అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా పంజాబ్, జమ్మూ సెక్టార్లలో చలికాలంలో దట్టమైన పొగమంచు (Fog) ఉంటుంది. ఆ సమయంలో విజిబిలిటీ దాదాపు సున్నాకి పడిపోతుంది. అత్యాధునిక కెమెరాలు కూడా చొరబాటుదారులను గుర్తించలేవు. అప్పుడు బీఎస్ఎఫ్ జవాన్లు ఈ 'బాటిల్ టెక్నిక్' మీదే ఎక్కువగా ఆధారపడతారు. ఇది 'ఆల్ వెదర్ ప్రూఫ్ సెక్యూరిటీ సిస్టమ్'గా నిరూపించుకుంది.
Latest News