|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 06:34 PM
మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ తన కొత్త త్రీ-వీలర్ ఆటోరిక్షా 'ఉడో'ను రూ. 3,58,999 పరిచయ ధరతో విడుదల చేసింది. విమానం ప్రేరణతో రూపొందించిన ఈ ఆటోరిక్షాలో ఫుల్ మోనోకోక్ నిర్మాణం, ఫైలట్ సీట్, విశాలమైన హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ వంటి ప్రత్యేకతలున్నాయి.ప్రయాణికుల కోసం తగినంత హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ ఇచ్చారు. స్టైలిష్ సీటింగ్ అందించారు. ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్, డ్యుయల్-ఫోర్క్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను ఇస్తున్నారు. దీని వల్ల గతుకల రోడ్లపై కూడా బెటర్ రైడ్ క్వాలిటీని అందిస్తుంది. రీజనరేటివ్ బ్రేకింగ్, సెగ్మెంట్‌లోనే తొలిసారిగా రివర్స్ థ్రోటిల్, హిల్ హోల్డ్, క్రీప్ మోడ్ వంటివి అందించారు.11.7 kWh లిథియం అయాన్ బ్యాటరీ కలిగిన ఉడో 10 kW పీక్ పవర్, 52 Nm టార్క్ అందిస్తుంది. ఒక్క ఛార్జ్‌తో 265 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతుంది, రియల్‌గా 200 కి.మీ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది రేంజ్, రైడ్, రేస్ మోడ్‌లను కలిగి ఉంటుంది. రేస్ మోడ్‌లో గంటలకు 55 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.
Latest News