|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 09:41 PM
ఈ కామర్స్ విభాగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి ముందంజలో ఉన్న ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలో కూడా అడుగుపెట్టనుంది. అయితే, కంపెనీ నిజానికి ఎప్పుడు ఈ సేవను ప్రారంభించనుందో, జొమాటో & స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ లీడర్లకు గట్టి పోటీ ఇచ్చగలదా అనే విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.వార్తల ప్రకారం, ఫ్లిప్‌కార్ట్ 2026 మే-జూన్ నాటికి బెంగళూరులో ప్రయోగాత్మకంగా ఫుడ్ డెలివరీ ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తరువాత, 2026 చివరి లేదా 2027 ప్రారంభంలో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఈ సర్వీస్ అందుబాటులోకి రానుందని అంచనా.వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీలోకి అడుగుపెట్టిన తర్వాత, జొమాటో & స్విగ్గీ వంటి లీడర్లకు గట్టి పోటీగా మారే అవకాశం ఉంది. కంపెనీ మార్కెట్ విలువ 2025 ఆర్థిక సంవత్సరానికి 9 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2030 నాటికి 25 బిలియన్ డాలర్ల వరకు చేరుతుందని అంచనా.ఫుడ్ డెలివరీ కోసం ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ప్రత్యేక టీమ్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గమనించదగ్గ విషయం ఏమిటంటే, రెండేళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్ ఓలా, పేటీఎం వంటి సంస్థలతో కలిసి ONDC ద్వారా ఫుడ్ డెలివరీ రంగంలోకి రావాలని యోచించినప్పటికీ, ఆ చర్చలు ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మళ్లీ తెరమీదకు వచ్చింది, కానీ ఫ్లిప్‌కార్ట్ నుండి ఇంకా అధికారిక ప్రకటనలేదు.ప్రస్తుతం ఫుడ్ డెలివరీ కోసం మార్కెట్లో పలు ప్లేయర్లు ఉన్నా, జొమాటో & స్విగ్గీ మాదిరిగానే సక్సెస్ సాధించలేకపోయారు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ప్రవేశించడం వల్ల ఫుడ్ డెలివరీ విభాగంలో ఎంత వరకు విజయం సాధించగలదో త్వరలోనే తెలుస్తుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ వార్తలు బయటి వినిపించగానే, జొమాటో, స్విగ్గీ షేర్లలో కొద్దిగా తగ్గుదల కనిపించింది.
Latest News