|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 11:26 AM
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో, భారత ప్రధాని మోదీ శుక్రవారం తారిఖ్ రెహమాన్‌కు అభినందనలు తెలుపుతూ Xలో ట్వీట్ చేశారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన అనిశ్చితికి తెరపడి, ఒక సుస్థిర ప్రభుత్వంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని న్యూఢిల్లీ ఆశిస్తోంది. గతంలో భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాదేశ్ వేదికగా మారిందనే ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్ పాకిస్థాన్ అనుకూల శక్తులకు దూరంగా ఉండటం భారత్‌కు ఊరటనిచ్చే అంశం.మరోవైపు బంగ్లాదేశ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఫేస్‌బుక్ అకౌంట్‌గా చెబుతున్న ‘యూఎస్ ఎంబసీ ఢాకా’ అనే అకౌంట్‌లో తారిక్ రెహమాన్‌ను అభినందిస్తూ పోస్ట్ ఉంది. పాకిస్తాన్ కూడా తన అభినందనలు తెలియజేసింది.తుది ఫలితాలు ఇంకా వెలువడనప్పటికీ బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఆధిక్యంలో ఉందని 'బీబీసీ బంగ్లా' పేర్కొంది.
Latest News