|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 11:54 AM
శాసనమండలిలో నేను అడిగిన ప్రశ్నకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా కొత్తగా ఒక్కరికీ సామాజిక పింఛన్లు మంజూరు చేయలేదని వారే ఒప్పుకున్నారు అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎప్పుడిస్తారంటే.. స్పష్టమైన తేదీ ప్రకటించకుండా ఇస్తామని చెప్పి తప్పించుకుంటున్నారు. ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం రూ. 15 వేలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఏ ఒక్కరికీ రూ. 15 వేలు ఇవ్వకపోగా 15 శాతం మందికి పథకాన్ని వర్తింపజేయలేదని నిలదీశాం. పైగా చాలా మంది ఖాతాల్లో కేవలం రూ. 7 వేలు రూ. 8 వేలు, రూ. 9 వేలు జమ చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకున్న విషయాన్ని కూడా సభ దృష్టికి తీసుకొచ్చాం. దీనిపై ప్రశ్నిస్తే సరిగా సమాధానం చెప్పడం లేదు. అబద్ధం చెబుతున్నారని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం తరఫున ఏ ప్రశ్న అడిగినా ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోతోంది. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే లోపు తక్షణం తల్లికి వందనం బకాయిలు చెల్లించాలి. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఠంచన్‌గా అమలు చేసిన అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. ప్రభుత్వ చర్యల కారణంగా చాలామంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
Latest News