|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 11:56 AM
అగ్రిగోల్డ్ బాధితులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అయితే అగ్రిగోల్డ్ సంస్థంకు సంబంధించి లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్లాట్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నవారికి ఊరట దక్కింది. ఏపీ ప్రభుత్వం జప్తు నుంచి మినహాయించే ఉత్తర్వుల పునరుద్ధరణ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, అప్పట్లో అగ్రిగోల్డ్ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.గ్రిగోల్డ్‌కు చెందిన 16,857.81 ఎకరాల భూమి, 82,207.08 చదరపు గజాల స్థలాలను జప్తు చేస్తూ 2015 ఫిబ్రవరి 20న అప్పటి తెదేపా ప్రభుత్వం జీవో 23 జారీ చేసింది. ఆ భూముల్లో పలు చోట్ల అగ్రిగోల్డ్ లేఔట్లు ఉన్నాయి. వాటిల్లో ప్లాట్ల కొనుగోలు కోసం పలువురు చందాదారులు అగ్రిగోల్డ్‌పై కేసులు నమోదు కాక మునుపే పూర్తిగా డబ్బులు చెల్లించి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలాంటి ప్లాట్లను జప్తు నుంచి మినహాయిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే వైకాపా అధికారం చేపట్టాక ఆ మినహాయింపును తొలగిస్తూ 2021 ఫిబ్రవరి 9న జీవో 19లో సవరణ ఉత్తర్వులిచ్చింది.
Latest News