|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 01:13 PM
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ గురువారం రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా, ఇటీవల తాను పూర్తి చేసిన 'సంకల్ప పాదయాత్ర' గురించి మంత్రికి బండ్ల గణేశ్ వివరంగా తెలిపారు.షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు 535 కిలోమీటర్ల పాటు 23 రోజుల పాటు సాగిన తన పాదయాత్ర అనుభవాలను, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని లోకేశ్‌తో పంచుకున్నారు. అనంతరం, శ్రీవారి దర్శనం తర్వాత స్వీకరించిన తీర్థ ప్రసాదాన్ని లోకేశ్‌కు అందజేశారు.
Latest News