|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:57 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజకీయ జీవితంపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కాగా.. అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఈక్రమంలోనే దీనిపై దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పందిస్తూ అత్యంత కీలక ప్రకటన చేసింది. గురువారం జరిగిన వారంతపు మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ట్రంప్ మోదీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో కనుక నిజమని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే..?
వైరల్ అవుతున్న వీడియోలో.. ట్రంప్ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈక్రమంలోనే ఆయన మోదీని ఒక గొప్ప మనిషి అని కొనియాడారు. ముఖ్యంగా మోదీకి ట్రంప్ అంటే చాలా ఇష్టం అని, ఇక్కడ ఇష్టం అంటే కేవలం స్నేహపూర్వకమైన భావం మాత్రమే అని అర్థం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. దానిని మరోలా తీసుకుంటే ఆయన రాజకీయ జీవితం దెబ్బతింటుందని.. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా తాను ఇండియాను ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నానంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ముఖ్యంగా ఈ వీడియోపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌కు మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో దీనిపై స్పందించిన ఆయన.. ప్రస్తుతానికి తాను ఆ వీడియో చూడలేదని చెప్పారు. నిజంగానే ట్రంప్ మోదీపై, భారత్‌పై కామెంట్లు చేసినా, ఒకవేళ ఎవరైనా కావాలనే ఈ వీడియోను సృష్టించినా తాము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు నెటిజెన్లు సైతం ఈ వీడియోపై స్పందిస్తున్నారు. ట్రంప్ సరదాగా ఇలాంటి కామెంట్లు చేశారని.. ఇందులో అంత తప్పుగా చూడాల్సిన అంశమేమీ లేదంటున్నారు. కానీ మరికొందరు మాత్రం భారతీయుల గురించి ట్రంప్ తప్పుగా మాట్లాడారని, మోదీకి ట్రంప్ ఇష్టం అని చెప్పినంత మాత్రానా దాన్ని స్నేహంగా కాకుండా మరో బంధంగా ఇండియన్లు చూడరంటూ చెప్పుకొస్తున్నారు. మరి ట్రంప్ చేసిన ఈ కామెంట్లు మీకెలా అనిపిస్తున్నాయో కామెంట్ల రూపంలో తెలియజేసేయండి.
Latest News