|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 10:20 AM
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శుక్రవారం రాత్రి స్వామి అమ్మవార్లకు పుష్పపల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శుక్రవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామికి నేత్రశోభితంగా పుష్పపల్లకి సేవ జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా విశేష పూజలు చేసి గంగాధరమండపం వద్దకు చేర్చారు. వివిధ వర్ణాల పుష్పాలతో ముగ్ధమనోహరంగా ముస్తాబైన పుష్పపల్లకిలో స్వామిఅమ్మవార్లను ఆశీనం గావించి ఆలయ ప్రధాన పురవీధిలో పుష్పపల్లకీ సేవ శోభాయమానంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు దర్శించుకున్నారు.
Latest News