|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 10:44 AM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌తో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతానికి మరో యుద్ధ విమాన వాహక నౌకను పంపుతున్నట్లు ప్రకటించారు. చర్చలతో ప్రయోజనం లేదని, అవసరమైతే కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఇరాన్ మాటలకే పరిమితమైందని, ఇక శాశ్వత పరిష్కారం కావాలని ట్రంప్ అన్నారు. అమెరికా సైన్యం ఇప్పటికే భారీగా మోహరించిందని తెలిపారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఇరాన్ కేవలం చర్చల పేరుతో కాలయాపన చేసిందే తప్ప, ఆచరణలో ఏమీ చూపడం లేదు. గత 47 ఏళ్లుగా వారు మాటలతోనే కాలం గడుపుతున్నారు. ఈ లోపు అమెరికా ఎందరో వీర జవాన్లను కోల్పోయింది. అంటూ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది సైనికులు తమ కాళ్లు, చేతులు, ముఖాలు కోల్పోయి వికలాంగులుగా మారారని, ఈ రక్తపాతం చాలా కాలంగా కొనసాగుతోందని ఆయన గుర్తు చేశారు.
Latest News