ఏపీ మంత్రి సత్యకుమార్ చొరవ.. యువకుడికి గుండెమార్పిడి
 

by Suryaa Desk | Tue, Feb 24, 2026, 06:24 PM

ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో యువకుడి ప్రాణాలు నిలబెట్టాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన చరణ్‌ కుమార్‌ మూడు వారాల క్రితం గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అతడికి గుండె మార్పిడి చేయాలని డాక్టర్లు తేల్చి చెప్పారు. యువకుడి తల్లిదండ్రులు ఈ సమస్యను మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు.. వెంటనే ఆయన స్పందించి బెంగళూరులోని దేహీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌‌ డాక్టర్లతో మాట్లాడారు. యువకుడికి అవసరమైన వైద్యసదుపాయాలు అందించాలని కోరారు.


అనంతరం ఆ ఆస్పత్రికి చరణ్‌కుమార్‌ను పంపించారు.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నెల 21న చరణ్‌కుమార్‌కు గుండె మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. చరణ్‌కుమార్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.. ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. 27 ఏళ్ల యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో అతడి గుండెను దానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. ఆ యువకుడి గుండెను చరణ్‌కుమార్‌కు అమర్చారు. మంత్రి చొరవతో యువకుడి ప్రాణాలు నిలబడ్డాయి.. అతడి తల్లిదండ్రులు మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు, ఆస్పత్రి డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శల్ హెల్ల్ ఇన్స్యూరెన్స్ పాలసీని హైబ్రిడ్ విధానంలో అమలు చేస్తామన్నారు వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. సార్వత్రిక ఆరోగ్య బీమా అమలు చేయడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. కోటీ 63 లక్షల కుటుంబాలు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతాయన్నారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది న్నారు. ఏడాదికి రూ.2.50 లక్షల బీమా కవరేజీ వర్తిస్తుందన్నారు.


తూర్పుగోదావరి జిల్లాలో అనుమానాస్పద కేసులు, మరణాలకు పాలు, ఇతర పదార్థాల కల్తీ కారణం కావచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది అన్నారు మంత్రి సత్యకుమార్. నిజానిజాలు తేల్చేందుకు పాలు, ఇతర శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించామన్నారు. రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని.. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.

Latest News
T20 WC 2026 crosses 500 mn viewers in India, highest ever in tournament’s history: ICC chief Jay Shah Wed, Mar 04, 2026, 02:55 PM
How India have fared in the semifinals in T20 World Cups Wed, Mar 04, 2026, 02:51 PM
X to suspend revenue sharing for users posting undisclosed AI war videos Wed, Mar 04, 2026, 02:46 PM
Indian missions across globe celebrate Holi, spread message of hope and unity Wed, Mar 04, 2026, 02:46 PM
Iran Embassy opens condolence book for Ayatollah Khamenei Wed, Mar 04, 2026, 02:42 PM