ప్రియుడి కోసం అమెరికాను వదిలి పాకిస్థాన్ పల్లెటూరి కోడలిగా..
 

by Suryaa Desk | Tue, Feb 24, 2026, 07:44 PM

ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపై పుడుతుందో ఎవరూ ఊహించలేరు. ఒకసారి మనసు కలిస్తే ఖండాల దూరమైనా, సంస్కృతుల వ్యత్యాసమైనా లెక్కచేయరు. తాజాగా ఒక అమెరికన్ యువతి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. విలాసవంతమైన అమెరికా జీవనశైలిని వదిలి.. పాకిస్థాన్‌లోని ఒక మారుమూల పల్లెటూరికి ఆమె కోడలిగా వెళ్లడం ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.


వైరల్ అవుతున్న 'టేలర్' ప్రేమ ప్రయాణం..


ఇన్‌స్టాగ్రామ్ వేదికగా టేలర్.. తన ప్రేమ కథను పంచుకుంది. ముఖ్యంగా ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేసింది. అందులో "కాస్త ఎక్కువగా ఫ్లర్ట్ చేశాను.. ఇప్పుడు పాకిస్థాన్‌లోని ఒక చిన్న కాలనీలో నా జీవితం ఇలా మారిపోయింది" అనే క్యాప్షన్‌తో ఆమె తన కొత్త జీవన శైలిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ వీడియోలో ఆమె తన భర్తతో కలిసి పల్లెటూరి వాతావరణంలో కనిపిస్తుంది. పచ్చని పొలాలు, మోటార్ బైకులు, పెరట్లోని కోళ్లు, పశువుల పాకలు.. ఇలా అంతా అచ్చమైన గ్రామీణ వాతావరణం అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా విదేశీయులకు ఏమాత్రం అలవాటు లేని బహిర్భూమిని కూడా ఆ వీడియోలో చూపించింది. అలాగే "నేను పాకిస్థాన్‌కు వస్తానని ఎప్పుడూ కలగనలేదు. కానీ ఇక్కడి జీవితాన్ని నేను ఇష్టపడుతున్నాను " అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది.


నెటిజన్ల మధ్య వార్: స్వర్గమా? నరకమా?


ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాకు, పాక్ పల్లెటూరికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని చూసి కొందరు ఆశ్చర్య పోతున్నారు. "నువ్వు స్వర్గం లాంటి జీవితాన్ని వదిలి నరకంలోకి వెళ్లావు" అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. "నేను పాకిస్థానీనే అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఉండలేను.. ప్రేమ నిజంగానే గుడ్డిది" అని మరొకరు ఎద్దేవా చేశారు. "లాహోర్ లేదా ఇస్లామాబాద్ లాంటి నగరాలకు వెళ్లకుండా.. ఈ పల్లెటూరి జీవితాన్ని ఎలా భరిస్తున్నావు? అమెరికా లైఫ్ కంటే ఇది ఎలా నచ్చింది?" అని ఒక నెటిజన్ తన సందేహాన్ని వ్యక్తం చేశాడు.


కొందరు విమర్శలు చేస్తున్నా మరికొందరు మాత్రం ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. "చాలామంది తమ ఆనందాన్ని ఇతరుల కోణంలో చూస్తారు. కానీ ఆమెకు ఆ పల్లెటూరిలో ఉండే ప్రశాంతత వేరెక్కడా దొరకకపోవచ్చు. విమర్శించే వారికంటే ఆమె రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోతుందని నేను బెట్ కడతాను" అని ఒక నెటిజన్ ఆమెకు మద్దతుగా నిలిచాడు. మరి ఈమె ప్రేమ కథ చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Latest News
Trump chose decisive action after diplomacy failed: JD Vance Tue, Mar 03, 2026, 11:27 AM
US missions across Pakistan suspend operations amid deadly protests over Khamenei's death Tue, Mar 03, 2026, 11:24 AM
Owaisi criticises Centre's 'advisory' for vigil on pro-Iran radical preachers Tue, Mar 03, 2026, 11:18 AM
Mamata Banerjee calls for 'holy harmony' on Dol Yatra and Holi Tue, Mar 03, 2026, 11:10 AM
Plimmer ruled out of Zimbabwe WODIs, NZ name Bella James as replacement Tue, Mar 03, 2026, 11:03 AM