|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 12:40 PM
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో తెలిపారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, ఒకే అభివృద్ధి వికేంద్రీకరణ తమ నినాదమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్లు ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉందని, 770 ప్రాజెక్టులు జీఓఎమ్ ట్రాక్ చేస్తోందని తెలిపారు.20 నెలల్లో ప్రభుత్వం 15,87 జాబ్ ఫెయిర్ లు నిర్వహించిందని తెలిపారు. 11,373 కంపెనీలు జాబ్ ఫెయిర్ లో పాల్గొన్నాయని చెప్పారు. లక్షా 8వేల 748మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. రాయలసీమలోని అనంతపూర్ లో ఆటోమోటివ్ క్లస్టర్, కడప మరియు చిత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అమరవాతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్, ఉత్తరాంధ్రలో ఫార్మ మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని చెప్పారు.
Latest News