|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 02:07 PM
రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను నగర కమిషనర్ రాహుల్ మీనా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్ సిబ్బందికి సమయపాలన కచ్చితంగా పాటించాలని, ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో శానిటరీ సూపర్‌వైజర్ ఇంద్రగంటి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
Latest News