|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 07:15 PM
పద్మనాభం మండలంలో రూ. 3.65 కోట్లతో 11 కిలోమీటర్ల అయినాడ - రేవిడి రోడ్డు పనులకు బుధవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు వల్ల ఏడు గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, కూటమి ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రేవిడిలో రూ. 50 లక్షలతో నిర్మించిన 'బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్'ను కూడా గంటా ప్రారంభించారు. దీనివల్ల స్థానికులకు తక్షణ వైద్యం అందుతుందని, ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
Latest News