|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 10:09 AM
శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ విజిలెన్స్ అప్రమత్తమైంది. తిరుమల చిత్రాలు, టీటీడీ పేరును దుర్వినియోగం చేస్తూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు నకిలీ వెబ్‌సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసు నమోదు చేసింది. భక్తులు కేవలం https://ttdevasthanams.ap.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారానే సేవలు పొందాలని టీటీడీ సూచించింది.ఈ నేపథ్యంలో నకిలీ వెబ్‌సైట్లపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు తితిదే ఐటీ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తితిదే చిహ్నాలు, ఆలయ చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న వెబ్‌సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేయించింది.
Latest News