|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 12:22 PM
పోర్టుల ఖర్చులపై ప్రభుత్వం తప్పుడు సమాచారంతో సభను తప్పుదారి పట్టిస్తోందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మధవరావు మండిపడ్డారు. పోర్టులపై ఎంత ఖర్చు చేశారనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా పొంతనలేని వివరాలు చెబుతున్నారని విమర్శించారు.బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వ కాలంలో జరిగిన ఖర్చులను ప్రస్తుత ప్రభుత్వం చేసినట్లుగా చూపిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే అంచనాలు, టెండర్లు ఎందుకు మార్చారన్న ప్రశ్నకు సరైన వివరాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆరు ఫిషింగ్ హార్బర్లు ప్రారంభిస్తారా లేదా అన్న అంశంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.పోర్టుల అనుసంధానం వల్లనే రహదారుల అభివృద్ధి సాధ్యమైందని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వంలో 50–60 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 5 శాతం కూడా జరగలేదని విమర్శించారు. జామాయిల్ ధర రూ.2 వేల నుంచి రూ.10 వేలకు పెరగడం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముందుచూపు చర్యల ఫలితమని పేర్కొన్నారు. రేపటిలోగా తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోతే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని తూమాటి మధవరావు హెచ్చరించారు.
Latest News