|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 03:54 PM
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి, ప్రయోజకుడవుతాడనుకున్న ఆ ఇంటి ఆశల దీపం ఆరిపోయింది. లండన్‌లో జరిగిన ఒక ఘోర అగ్నిప్రమాదంలో కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని కొండయ్యపేటకు చెందిన గొంతి అభిషేక్ (28) మృతి చెందాడు. ఈ వార్తతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.అభిషేక్ తండ్రి ఆస్కారరావు ఆగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌ఓ (CHO)గా విధులు నిర్వహిస్తున్నారు. తన కుమారుడిని ఉన్నత విద్యావంతుడిగా చూడాలన్న ఆకాంక్షతో మూడేళ్ల క్రితం ఆయన అభిషేక్‌ను ఎంబీఏ చదివేందుకు లండన్ పంపారు. చదువు పూర్తయిన తర్వాత అభిషేక్ అక్కడే ఒక సంస్థలో ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డాడు. కేవలం ఆరు నెలల క్రితమే ఆయన స్వస్థలానికి వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి వెళ్లాడు. అంతలోనే ఈ ఘోరం జరగడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది.
Latest News