|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 04:07 PM
రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం జనసేనాని పవన్ కల్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేయడమే లక్ష్యంగా, 'మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్' అనే శక్తిమంతమైన నినాదంతో మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదుకు నేడు జనసేన శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు పిఠాపురం నియోజకవర్గానికే పరిమితమైన ఈ కార్యక్రమం, నేటి నుంచి విసృత రూపం దాల్చనుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు మహారాష్ట్రలోనూ తన ఉనికిని చాటుకోవాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి భారీ స్థాయిలో సభ్యులను చేర్చుకోవడం ద్వారా కేడర్ బలాన్ని ప్రదర్శించాలని అధినేత పవన్ కల్యాణ్ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు.
Latest News