|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 06:47 PM
వరంగల్ లో ఈనెల 28న జరగనున్న ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రి కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల సమస్యలపై ఈ మహాసభలో చర్చించనున్నారు.
Latest News