నార్జో సిరీస్‌లో బిగ్ బ్యాటరీ బ్లాస్ట్.. 10,001mAhతో కొత్త ఫోన్
 

by Suryaa Desk | Thu, Feb 26, 2026, 10:24 PM

Realme తన నార్జో సిరీస్‌లో భాగంగా భారీ 10,001mAh బ్యాటరీతో కూడిన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నార్జో లైన్‌లో ఇది తొలి 10,001mAh బ్యాటరీ ఫోన్‌గా మార్కెట్‌లోకి రానుంది.డిజైన్ పరంగా చూస్తే, ఇది ఇటీవల విడుదలైన Realme P4 Power మోడల్‌ను పోలి ఉంటుంది. మరి ఈ అప్కమింగ్ డివైస్‌లో ఉండే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏంటో తెలుసుకుందాం.Realme Narzo Power: లాంచ్ ఎప్పుడు?Realme Narzo Powerను మార్చి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్‌లో ఆవిష్కరించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్‌కు సంబంధించి Amazon India ప్రత్యేక టీజర్ పేజ్‌ను కూడా లైవ్‌లో ఉంచింది.
-Realme Narzo Power: ముఖ్య ఫీచర్లు : డిజైన్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ పి4 పవర్ తరహాలోనే ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. 6.8 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో ఇది వస్తోంది. 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు స్క్రీన్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. మెరుగైన విజువల్స్ కోసం హైపర్ విజన్ ప్లస్ AI చిప్‌ను కూడా ఇందులో పొందుపరిచారు.పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్‌ను MediaTek Dimensity 7400 Ultra 5G చిప్‌సెట్‌తో విడుదల చేస్తున్నారు.కెమెరా సెటప్ విషయానికి వస్తే, 50MP Sony IMX882 ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8MP అల్ట్రా వైడ్ లెన్స్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్‌తో పాటు పలు AI ఆధారిత కెమెరా ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ డివైస్ Android 16 ఆధారిత realme UI 7.0పై పని చేస్తుంది.అత్యంత ముఖ్యంగా, 10,001mAh భారీ బ్యాటరీ రెండు రోజుల వరకూ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండగా, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. టైటాన్ బ్లూ, టైటాన్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

Latest News
Pakistan must urgently reform or drift into 'managed decline' by 2031 Sun, Mar 01, 2026, 05:53 PM
'Khamenei's assassination may not ensure regime change, cause global economic fallout' Sun, Mar 01, 2026, 05:35 PM
Ayatollah Arafi named Iran's interim Supreme Leader Sun, Mar 01, 2026, 05:27 PM
TCS' market cap falls over Rs 18,000 crore last week Sun, Mar 01, 2026, 05:22 PM
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM