|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 11:16 PM
WhatsApp యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పును ప్రకటించింది. ఇకపై వాట్సాప్ వినియోగానికి సిమ్ బైండింగ్ తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఈ నియమం మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది.ఇప్పటివరకు కొంతమంది యూజర్లు ఫోన్‌లో సిమ్ యాక్టివ్‌గా లేకపోయినా కేవలం నంబర్ ఆధారంగా వాట్సాప్ ఉపయోగించేవారు. అయితే కొత్త నిబంధన ప్రకారం, మీరు ఉపయోగిస్తున్న వాట్సాప్ నంబర్ ఉన్న సిమ్ అదే మొబైల్‌లో యాక్టివ్‌గా ఉండాలి. లేకపోతే సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నియమానికి ఎలాంటి మినహాయింపులు ఉండవని సమాచారం. నిబంధనలు పాటించని యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అదనంగా, వాట్సాప్ వెబ్ ఉపయోగించే వారు ప్రతి ఆరు గంటలకు ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సెషన్ రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వెబ్ సెషన్ స్వయంచాలకంగా ముగిసిపోతుంది.ఈ మార్పులు కేవలం వాట్సాప్‌కే పరిమితం కాకుండా Telegram, Signal వంటి ఇతర మెసేజింగ్ యాప్‌లకూ వర్తించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 1లోపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన సాంకేతిక మార్పులు చేయాలని సంబంధిత సంస్థలకు సూచించినట్లు సమాచారం.
Latest News