|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 11:53 PM
ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.గురువారం చెన్నూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, టీజీఎస్‌డబ్ల్యూ రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మార్చి 16 వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.పరీక్షార్థులకు తాగునీరు, ఫ్యాన్లు, సరిపడిన కూర్చోవడానికి ఏర్పాట్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. కేంద్రాల వద్ద భద్రత కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పరీక్ష సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపాలని ఆదేశించారు.అనంతరం చెన్నూరులో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Latest News