ఆయేషా మీరా అవశేషాల ఖననం: తెనాలిలో భారీ బందోబస్తు
 

by Suryaa Desk | Fri, Feb 27, 2026, 12:02 PM

ఆయేషా మీరా శరీర అవశేషాలను తెనాలి చెంచుపేటలోని ఖబరస్థాన్లో నేడు ఖననం చేయనున్న నేపథ్యంలో ఈద్గా వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీబీఐ కోర్టుకు వెళ్లిన ఆయేషా తల్లిదండ్రులు అవశేషాలను తీసుకొని మధ్యాహ్నం తెనాలి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ముస్లిం మత పెద్దల సమక్షంలో శరీరాన్ని తిరిగి ఖననం చేయనున్నారు. ఆయేషా మీరాకు అంతిమ వీడ్కోలు పేరిట ప్రజా సంఘాలు చలో తెనాలికి పిలుపునిచ్చాయి.నిందితులు ఎవరో ఇప్పటికీ తెలియని ఈ కేసు లో ప్రజా సంఘాలు, లాయర్లు అయేషా మీరాకు సంఘీభావం గా ఈరోజు ర్యాలీ లకు పిలుపునిచ్చారు. విజయవాడ కోర్టు నుండి నగరం లోని డా.అంబెడ్కర్ భారీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించాలని లాయర్లు పిలుపు ఇచ్చారు. ఆ తరువాత అయేషా తల్లితండ్రుల వెంటే తెనాలి వరకూ వెళ్ళడానికి 'ఛలో తెనాలి ' కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. అయితే దీనిపై పోలీసులు అలెర్ట్ గా ఉన్నారు. ఇటు విజయవాడ, అటు తెనాలి లో పూర్తిగా అప్రమత్తం గా ఉండడమే కాకుండా ప్రజలకు పలు సూచనలు చేశారు. దానితో ఆ రెండు చోట్లా ఒక విధమైన ఉద్వేగ పూరిత వాతావరణం నెలకొని ఉంది. పూర్తిగా సంచలనం సృష్టించిన ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాలోని ప్రజలకూ బాగా సువరిచితం కావడం తో తెలుగు ప్రజలు కూడా పరిణామాలను గమనిస్తూ ఉన్నారు.

Latest News
TCS’ market cap falls over Rs 18,000 crore last week Sun, Mar 01, 2026, 05:22 PM
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM
T20 WC: Sikandar Raza's superb 73 carries Zimbabwe to 153/7 against South Africa Sun, Mar 01, 2026, 05:08 PM
Protests erupt in Hyderabad over Khamenei's killing Sun, Mar 01, 2026, 05:03 PM
Israel-US attack on Iran: Karnataka Deputy CM condemns strikes on school Sun, Mar 01, 2026, 04:51 PM