|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 12:04 PM
రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్, కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చకు అంగీకరించిన ప్రభుత్వం.. సభలో మాత్రం సమాధానం చెప్పలేక ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయించిందని, మంత్రి పయ్యావుల కేశవ్ అనుచితంగా వ్యవహరించారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. వెలగపూడిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఇందాపూర్ ముసుగులో చంద్రబాబు కుటుంబ సంస్థ హరిటేజ్ చేసిన అవినీతి గురించి చర్చ జరగడం ఇష్టం లేకనే అడుగడుగునా ఆటకం కల్పించడంతోపాటు, సభా నియమాలను సైతం ఉల్లంఘించారని ఆరోపించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా రేవంత్ రెడ్డి మాటలను ఖండించకుండా వత్తాసు పలికేలా మాట్లాడారని వెల్లడించారు. వారి సన్నిహిత సంబంధాలు, రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నారని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు.
Latest News