|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:31 PM
సింగపూర్‌లో భారత సంతతికి చెందిన షర్వీన్ శెట్టి (48) అనే వ్యక్తి, తాను పోలీసునని నమ్మించి, ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలాడు. 2022 జూలై 11న లిటిల్ ఇండియా మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు షర్వీన్‌ను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 3న హైకోర్టులో హాజరైన నిందితుడు, మొదట్లో నేరాన్ని ఖండించినా, తర్వాత అంగీకరించాడు. బాధితురాలిని స్నేహితుల నుంచి వేరు చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడటం పక్కా ప్లాన్ అని కోర్టు నిర్ధారించింది. దీంతో అతనికి 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు 12 కొరడా దెబ్బల శిక్ష విధించారు.
Latest News