|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 11:48 PM
శుక్రవారం బంగ్లాదేశ్ కేంద్రంగా భూకంపం సంభవించి తూర్పు భారత రాష్ట్రాలపై ప్రభావం చూపింది. ఈ ప్రకంపనలు ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ పలు ప్రాంతాల్లోనూ స్పష్టంగా అనుభూతి అయ్యాయి.ముఖ్యంగా కోల్‌కతా మహానగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మధ్యాహ్నం 1.22 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రతతో కంపనలు నమోదైనట్లు భారత భూకంప పరిశోధనా కేంద్రం వెల్లడించింది. బంగ్లాదేశ్‌లోని సత్కీరా జిల్లాలో భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ ప్రాంతం కోల్‌కతాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా, సరిహద్దు జిల్లా నార్త్ 24 పరగణాలోని టాకీకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోనే ఎపిసెంటర్ ఉన్నట్లు సమాచారం. ఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో దాదాపు 10 సెకండ్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి.అయితే పశ్చిమ బెంగాల్‌లో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని వెల్లడించారు.
Latest News