|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 11:11 AM
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో క్రిప్టోకరెన్సీ పెట్టుబడులు లాభాల కంటే సంయమనంతో కూడిన వ్యూహంతో సాగుతున్నాయని జియోటస్ సంస్థ 2025 వార్షిక నివేదిక వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల ఇన్వెస్టర్లు తక్కువ రిస్క్ తీసుకుంటూ, దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి సారిస్తున్నారు. సౌత్ ఇండియాలో మొత్తం ట్రేడర్లలో వీరి వాటా 16.9% ఉన్నా, ట్రేడింగ్ వాల్యూమ్‌లో 11.8% మాత్రమే ఉంది. తెలంగాణలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నా, క్రిప్టో ట్రేడర్ల సంఖ్య, వాల్యూమ్‌లో చివరి స్థానంలో ఉంది. ఏపీలో 21.7% మంది 'HODL' కేటగిరీలో దీర్ఘకాలం క్రిప్టోను ఉంచుకుంటున్నారు.
Latest News