|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:48 PM
బీఏసీ సమావేశంలో లడ్డూపై చర్చ చేపట్టాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. లడ్డూ గురించి చర్చ జరిగితే హెరిటేజ్ అవినీతి బయటకొస్తుందనే భయంతో స్టేట్‌మెంట్ ఇచ్చేసి తప్పించుకోవాలనే పన్నాగానికి మంత్రి పయ్యావుల కేశవ్ తెరదీశారు అని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ వాపోయారు. అయన మాట్లాడుతూ... రాజకీయాల కోసం దేవుళ్లను రాజకీయాల్లోకి లాగిన చంద్రబాబు.. తన కుట్రలు బయటకు రావడంతో సమాధానం చెప్పలేక పారిపోతున్నారు. చేసిన తప్పుని అంగీకరించి భక్తులకు సమాధానం చెప్పాల్సిందిపోయి మరింత దిగజారి ప్రవర్తించడం రాష్ట్ర ప్రజలంతా చూశారు. సీబీఐ సిట్ చార్జిషీట్ సాక్షిగా ఆయన చేసిన మోసాలను ప్రజలు గుర్తించారు అని అన్నారు.
Latest News