|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:58 PM
నెయ్యి కల్తీ పేరుతో ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోయుంటే చర్చకు రావడానికి ప్రభుత్వం ఎందుకు భయపడిపోతోంది? అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ... హెరిటేజ్ కి ఇందాపూర్ కి సంబంధం లేదన్నది నిజమే అయితే ఇందాపూర్ పేరెత్తితో ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది? హెరిటేజ్ వెబ్‌సైట్‌లో ఎందుకు మార్పులు చేశారు? బీఏసీలో చర్చకు అంగీకరించి సభలో మాత్రం అడ్డుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో హిందూ మతానికి జరిగిన ద్రోహం గురించి బయటపెడతామని టీడీపీ భయపడిపోతోంది అని అన్నారు.
Latest News