|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 01:00 PM
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా లక్షణాలతో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం పట్ల మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి స్పందించారు. ఇది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా అంటూ చంద్రబాబును ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత, ఆహార పదార్థాల పరిశీలనపై కఠిన నియంత్రణలు అవసరమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు.
Latest News