|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:27 PM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు కీలక సంక్షేమ, ఆరోగ్య పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో రాష్ట్రవ్యాప్త హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడంతో పాటు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మొదట చీపురుపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు (సీహెచ్‌సీ) చేరుకుని, బాలికలలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉద్దేశించిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్‌ను ప్రారంభిస్తారు. ఇదే సమయంలో రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొంటారు. అనంతరం, రావివలస సమీపంలోని పైలపేటలో ఏర్పాటు చేసిన 'ప్రజావేదిక' బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
Latest News