వాటర్ ట్యాప్స్ నుంచి కమోడ్ వరకు ,,,,,క్లీన్ చేసే సులువైన చిట్కాలు
 

by Suryaa Desk | Sat, Feb 28, 2026, 10:57 PM

బాత్రూం క్లీనింగ్ అంటేనే ఒక పెద్ద భయపడిపోతున్నారా? ట్యాపులపై మచ్చలు వదిలించడానికి గంటల తరబడి శ్రమిస్తున్నారా? ఇకపై ఆ తిప్పలు పడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో లైఫ్ స్టైల్ టిప్స్ ఇస్తూ.. విపరీతమైన గుర్తింపు పొందిన దీప్తి కపూర్ బాత్రూంను మెరిపించేందుకు కొన్ని అద్భుతమైన 'హ్యాక్స్'ను పంచుకున్నారు. వంటింట్లో దొరికే బంగాళదుంప, పేస్టుతోనే మీ బాత్రూంను ఎలా మెరిపించుకోవాలో చెప్పారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


స్టీల్ ట్యాపులపై మొండి మరకల్ని వదిలించే చిట్కా


సాధారణంగా బాత్రూమ్‌ల్లో ఉండే స్టీల్ ట్యాపులు నీటిలో ఉండే లవణాల వల్ల త్వరగా పాడైపోతుంటాయి. ట్యాపులపై తెల్లటి మచ్చలు ఏర్పడి అవి చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి. ఎంత సోపు పెట్టి రుద్దినా అవి వదలవు. దీనికి దీప్తి కపూర్ ఒక వినూత్న పరిష్కారం చూపారు.


మచ్చలు ఉన్న ట్యాపులపై ముందుగా టూత్ పేస్టు పూయాలని.. ఆ తర్వాత అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను ఉండలా చుట్టి దాంతో గట్టిగా రుద్దాలన్నారు. ఇలా చేసిన తర్వాత నీటితో కడిగేస్తే ట్యాపులపై ఉన్న తెల్లటి పొర పూర్తిగా తొలగిపోయి అవి కొత్తవాటిలా మెరుస్తాయని చెప్పుకొచ్చారు.


గాజు గోడలపై నీటి మరకల నివారణ


ప్రస్తుత కాలంలో చాలామంది మోడ్రన్ బాత్రూంల్లో షవర్ ఏరియా వద్ద గాజు గోడలు పెట్టించుకుంటున్నారు. ఈ గాజుపై నీటి చుక్కలు పడి ఆరిపోవడం వల్ల మొండి మరకలు ఏర్పడతాయి. వీటిని క్లీన్ చేయడం చాలా కష్టమైన పని. అయితే దీనికోసం ఖరీదైన కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదని దీప్తి కపూర్ పేర్కొన్నారు.


ఒక ఆలుగడ్డను తీసుకుని దానిని సగానికి కోసి.. ఆ ముక్కతో గాజు గోడపై రుద్దాలన్నారు. బంగాళదుంపలో ఉండే స్టార్చ్ గాజుపై ఉన్న మురికిని, మచ్చల్ని సులభంగా వదిలిస్తుందని చెప్పారు. ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడిస్తే గాజు పారదర్శకంగా మారుతుందన్నారు.


కమోడ్ దుర్వాసన, పసుపు రంగు మచ్చలకు పరిష్కారం


బాత్రూం ఎంత క్లీన్‌గా ఉన్నా కమోడ్ దగ్గర దుర్వాసన వస్తుంటే ఆ ఫీలింగ్ అస్సలు బాగుండదు. అలాగే లోపలి భాగం పసుపు పచ్చగా మారిపోవడం మరో ప్రధాన సమస్య. ఇలాంటి సందర్భంలో బేకింగ్ సోడా అద్భుతంగా పని చేస్తుందని డిజిటల్ క్రియేటర్ దీప్తి కపూర్ చెప్పారు. ముఖ్యంగా బేకింగ్ సోడాను కమ్మోర్డ్ లోపల బాగా చల్లాలని ఆపై దాని మీద కొద్దిగా వైట్ వెనిగర్ పోయాలన్నారు.


వెనిగర్ వేయగానే వచ్చే నురుగు ఆ మొండి మచ్చల్ని కరిగించేస్తుందని పేర్కొన్నారు. ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆపై బ్రష్‌తో క్లీన్ చేస్తే మురికి వదలడమే కాకుండా దుర్వాసన కూడా పూర్తిగా పోతుందన్నారు.


అల్యూమినియం ఫాయిల్ పేపర్ మ్యాజిక్


చాలామందికి అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను కేవలం ఆహారం ప్యాక్ చేయడానికి మాత్రమే వాడతారని తెలుసు. కానీ క్లీనింగ్ ప్రక్రియలో ఇది ఒక స్క్రబ్బర్‌లా పనిచేస్తుందని దీప్తి కపూర్ వెల్లడించారు. స్టీల్ ట్యాపులు లేదా షవర్ హెడ్స్ శుభ్రం చేసేటప్పుడు ఇనుప పీచు వాడితే గీతలు పడే అవకాశం ఉంటుందన్నారు.


కానీ ఫాయిల్ పేపర్ వాడటం వల్ల ట్యాపులపై స్క్రాచ్‌లు పడవని చెప్పారు. పేస్టు, ఫాయిల్ పేపర్ కాంబినేషన్ స్టీల్ వస్తువులకు మంచి మెరుపును ఇస్తుందన్నారు. ఈ చిన్న టెక్నిక్ ఉపయోగించి బాత్రూం యాక్సెసరీస్ అన్నింటినీ తలతలా మెరిపించవచ్చని స్పష్టం చేశారు.


సహజ సిద్ధమైన క్లీనింగ్ పద్ధతులు


మార్కెట్లో లభించే క్లీనింగ్ లిక్విడ్లలో ఘాటైన రసాయనాలు ఉంటాయని.. ఇవి చేతులకు గానీ, శ్వాసకు గానీ ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని దీప్తి కపూర్ తెలిపారు వీటికి బదులుగా బంగాళదుంప, వెనిగర్, బేకింగ్ సోడా వంటి సహజ వస్తువులను వాడటం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుందన్నారు.


దీప్తి కపూర్ చెప్పిన ఈ చిట్కాలు ప్రతి ఇంట్లో సులభంగా దొరికే వస్తువులతో కూడుకున్నవి కాబట్టి ఎవరైనా ప్రయత్నించవచ్చు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ టిప్స్‌ను ఓసారి ఫాలో అయిపోండి.

Latest News
Dr Rajendra Prasad remembered on his 63rd death anniversary; CM Nitish pays floral tribute Sat, Feb 28, 2026, 03:21 PM
CM Gupta launches HPV vaccination drive; Delhi aims to vaccinate 1.6 lakh girls in three months Sat, Feb 28, 2026, 03:11 PM
AGuH adopts stealth strategy: Expands in North, lies low in J&K Sat, Feb 28, 2026, 02:42 PM
India vs West Indies head-to-head record and last five matches performance Sat, Feb 28, 2026, 02:38 PM
India urges nationals in Israel to stay alert after Israel US strikes on Iran Sat, Feb 28, 2026, 02:31 PM