|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 01:15 PM
సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌లు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై నీచమైన రాజకీయం చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీరాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా ప్రమాదం జరగడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైయస్ఆర్‌సీపీతరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెన్షన్ల కోత విపరీతంగా పెరిగిపోయిందని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వైయస్ జగన్ హయాంలో 66.34 లక్షల పెన్షన్లు ఇస్తే... ఇప్పుడు ఆ సంఖ్య 60 లక్షలకు పడిపోయిందని.. అంటే దాదాపు 6 లక్షల మంది అర్హులకు పెన్షన్లు ఎగరగొట్టారని మండిపడ్డారు. మరోవైపు నెయ్యి రేట్లు పెంచుకోవడానికి, తమ బినామీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడానికే చంద్రబాబు 'కల్తీ లడ్డూ' డ్రామా ఆడారని ఆయన విమర్శించారు.నిబంధనలకు విరుద్దంగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఇవ్వడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపించారు.వైష్ణవి డెయిరీకి, టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకు చెందిన సంగం డెయిరీకి అవినాభావ సంబంధం ఉందని.. ఆవు పాల సేకరణే లేని సంగం డెయిరీకి నెయ్యి కాంట్రాక్టు ఎలా ఇచ్చారని నిలదీశారు. మూడుసార్లు టెండర్లు పిలిచి ఎవరినీ రాకుండా అడ్డుకుని, చివరికి తమ వారికే కట్టబెట్టారని ధ్వజమెత్తారు. మండలిలో లడ్డూ, ఇందాపూర్ అంశాలపై చర్చకు రమ్మంటే ప్రభుత్వం ఎందుకు పారిపోతోందని ప్రశ్నించారు. మండలి చైర్మన్‌ను ఒక మంత్రి డిక్టేట్ చేయడం ప్రజాస్వామ్యానికే అవమానమని అన్నారు. వైయస్ఆర్‌సీపీ సభ్యులు మాట్లాడేటప్పుడు విజువల్స్ కట్ చేస్తున్నారని, ఇది దారుణమని విమర్శించారు. లోకేష్ చూపిస్తున్న రెడ్ బుక్ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.
Latest News