|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 01:16 PM
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అజ్జాడ గ్రామ నాయకులు వైయస్ఆర్‌సీపీలో చేరారు. పార్వతీపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా మాజీ వైస్ ఎంపీపీ అక్కేన ఎల్లం నాయుడు, అజ్జాడ వైస్ సర్పంచ్ కాగాన అప్పలనాయుడు తమ అనుచరులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త క్యాంప్ కార్యాలయంలో కార్యక్రమం పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరగా చిన్న శ్రీను కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అక్కేన ఎల్లం నాయుడు మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై విశ్వాసంతోనే తాము తెలుగుదేశం పార్టీని వీడి చేరినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ విజయానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కె.వి సూర్యనారాయణ రాజు, నెక్కల నాయుడు బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు సత్తిబాబుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Latest News