|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 02:05 PM
కాకినాడలో జరిగిన ఘోర బాణసంచా పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో గాయపడి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన ఆయన, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం.. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా రూ. 2 లక్షల సాయం అందించిందని తెలిపారు.ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారని, మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో 12 మంది ఎస్సీలు, 9 మంది మహిళలు ఉన్నారని, వీరంతా కేవలం పూట గడవడం కోసం కూలీ పనులకు వెళ్లిన నిరుపేదలని సీఎం గుర్తుచేసుకున్నారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు పునరావృతం కాకూడదని, అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
Latest News