రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జి.సాయిప్రసాద్
 

by Suryaa Desk | Sun, Mar 01, 2026, 03:12 PM

రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీఎస్ కె.విజయానంద్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌లోని పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది.. కొత్త సీఎస్ కు శుభాకాంక్షలు తెలిపారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సాయి ప్రసాద్ ఉమ్మడి ఏపీలోనే కాకుండా విభజన రాష్ట్రంలోనూ కీలక పదవులు నిర్వహించారు.జి.సాయి ప్రసాద్ స్వస్థలం.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని మట్టిగుంట గ్రామం. రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన ఆయన.. 2024 జూన్ నుంచి జలవనరల శాఖ కార్యదర్శిగా, 2025 జనవరి నుంచి సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలను కూడా ప్రభుత్వం ఆయనకే అప్పగించింది.2019 నుంచి 2014 మధ్య కాలంలో ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ, ఇంధనశాఖ ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏగా వ్యవహరించారు. ప్రస్తుత సీఎస్ కె.విజయానంద్ ఉద్యోగ విరమణ అనంతరం నూతన సీఎస్‌గా సాయిప్రసాద్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 29న ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.

Latest News
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM
T20 WC: Sikandar Raza's superb 73 carries Zimbabwe to 153/7 against South Africa Sun, Mar 01, 2026, 05:08 PM
Protests erupt in Hyderabad over Khamenei's killing Sun, Mar 01, 2026, 05:03 PM
Israel-US attack on Iran: Karnataka Deputy CM condemns strikes on school Sun, Mar 01, 2026, 04:51 PM
Muslim clerics condemn killing of Khamenei, call for peace Sun, Mar 01, 2026, 03:41 PM