01.03.2026 నుండీ 07.03.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
 

by Suryaa Desk | Sun, Mar 01, 2026, 07:11 PM

మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)ప్రారంభంలో విద్యాపరమైన ప్రణాళికలలో నూతన విషయాలు నేర్చుకోవడంలో అనుకూలతలు ఏర్పడతాయి. గృహ వాతావరణం, స్థిరాస్తులు అంశాలు తల్లితో చర్చిస్తారు. విద్యార్థులకు జ్ఞాపకశక్తి ఏకాగ్రత , వ్రాత నైపుణ్యాలులో శ్రద్ధ పెంచుకోవాలి. వ్యక్తులు మానసిక ప్రశాంతతలో, ఉపాసనలో ఆటంకాలను అధిగమించాలి. సంతానం, పెట్టుబడులు సంబంధ అభివృద్ధి విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. పూర్వపు బకాయిలు తీరుస్తారు. బంధు వర్గంతో అనుకూలతలు. కళత్ర ఆరోగ్యంపై శ్రద్ధ. భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్తలు. ముఖ్యమైన విషయాలు వాయిదా పడతాయి. భాగస్వామితో ప్రయాణాల కొరకు ఆలోచన చేస్తారు. ఇష్ట దేవతారాధన మేలు.


వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  


స్నేహితులతో కమ్యూనికేషన్ బాగుంటుంది. అనుకున్న సమయంలో సామర్థ్యంతో పనులని పూర్తి చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం. విద్యార్థులకు ఏకాగ్రత లోపాలు పట్టుదలతో శ్రమించి అధికమిస్తారు. నూతన అంశాలు నేర్చుకుంటారు. స్థిరాస్తుల విషయంలో, పెట్టుబడిల కొరకు ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం అందుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతానానికి దూర ప్రదేశాలలో వృత్తిపరమైన అభివృద్ధి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ, అభిరుచులను పెంచుకుంటారు. దినచర్యలో మార్పులు. వ్యక్తిగత అంశాలలో ప్రత్యేక శ్రద్ధ, ఆకర్షణ పెరుగుతాయి. స్త్రీల సహకారం అనుకూలం. ఆదిత్య హృదయ పారాయణ మేలు చేస్తుంది.


మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  


ప్రారంభంలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్య వ్యవహారాలలో ఇతరుల సహకారం తీసుకోవడానికి సందేహిస్తారు. దగ్గర ప్రయాణాల యందు చికాకులు సౌకర్య లోపం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తండ్రి, సోదరులతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సహకార అంశాలలో ఘర్షణలను అధిగమించాలి. స్థిరాస్తులు, భూమి విషయాలలో పెట్టుబడిలో కమ్యూనికేషన్ ఇబ్బందుల వల్ల ఆత్మీయులతో, ఉన్నత స్థాయి అధికారులతో సమస్యలకు అవకాశాలు. వృత్తిపరంగా బాధ్యతలు శ్రమ అధికం, సృజనాత్మకత గుర్తించ బడుతుంది. సమయానికి ఆహార స్వీకరణ విశ్రాంతి అవసరం. ఆలోచనలలో ఆలస్యాలు వలన ముఖ్యమైన అవకాశాలు కోల్పోయే ప్రమాదం. విద్యార్థులకి జ్ఞాపక శక్తిని పెంపొందించుకొని, విద్యపై దృష్టి అవసరం. శ్రీ హయగ్రీ వాయ నమః శ్లోకం మేలు చేస్తుంది.


కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)


కొత్త ఆలోచనలు, నిర్ణయాలతో వారం ప్రారంభిస్తారు. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు ఘర్షణాత్మకంగా ఉంటాయి. మాటల వల్ల ఆత్మీయుల మధ్య అహం సమస్యల్ని అధిగమించాలి. మీడియాలో, ఇంటర్నెట్లో విమర్శలు చేసే సంబంధం లేనివ్యక్తులకు దూరంగా, అధికంగా స్పందించకుండా ఉండడం మేలు. దంత, నేత్ర సమస్యలు చికాకులు కలిగిస్తాయి. నూతన ప్రదేశాలలో ఆరోగ్య ఆహార స్వీకరణ విషయాలలో జాగ్రత్తలు అవసరం. శ్రమతో సమయానికి పనులు పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలలో ఆటంకాలు, ఆలస్యమైనా పనులు పూర్తి చేయగలుగుతారు. వారం చివరిలో స్థిరాస్తులు, వాహనాలకు సంబంధించిన నిర్ణయాలు, ఉన్నత విద్య అనుకూలం. అమ్మవారి ఆరాధన మేలు.


సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)


వారం ప్రారంభం ఖర్చులు అధికంగా ఉంటాయి. అధిక శ్రమ నిద్రలేమి. దూర ప్రయాణాలకు అవకాశం. ప్రశాంతత తక్కువ. అకారణంగా ఎదుర్కొంటున్న మానసిక వైరాగ్యాన్ని అధిగమించాలి. ఆరోగ్య శ్రద్ధ అవసరం. సాంఘిక సంబంధాల్లో ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు నూతన వ్యక్తుల ఆధిపత్యం అధికంగా ఉంటుంది. కమ్యూనికేషన్ విషయంలో తగిన శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల కోసం ఆకస్మిక ఖర్చులు. భాగస్వామితో కలిసి ప్రయాణములు, ఆలోచనలలో నూతన మార్పులు. ధైర్యముగా తీసుకొనే కొన్ని నిర్ణయాలు ఆలస్యమైన లాభాన్ని ఇస్తాయి..తల్లి తండ్రులతో, ఉన్నతధికారులతో చర్చలు జరిపేటపుడు ఘర్షణలు, ఉద్వేగాలు అధి గమించాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన శ్రద్ధ అవసరం. 'శరవనభవ' శ్లోకం మేలు.


కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)


ప్రారంభంలో ఆశించిన విషయాలలో, ఆర్థిక అంశాలలో అనుకూలతలు, మంచి వార్తలు వినడం, మానసిక ప్రశాంతత. చిన్ననాటి మిత్రుల కలయిక. మధ్యలో ఆధ్యాత్మిక విషయముల మీద ఆసక్తి. నిద్రలేమి. ఆకస్మిక ధన వ్యయం. ఆరోగ్య అభివృద్ధి కై, పూర్వపు రుణములు తీర్చుట కొరకు అందిన ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నాలు. న్యాయ సంబంధమైన అంశాలు, ప్రత్యర్థుల మీద విజయం కొరకు శ్రమ అధికం. వృత్తిపరంగా నూతన ప్రయత్నాలు దూర ప్రదేశాలలో అనుకూలిస్తాయి. విద్యార్థులు విద్యాపరంగా తగిన శ్రమతో ప్రణాళికతో పోటీలలో ఆసక్తిని పెంచుకుంటారు. శ్రీ దత్త శరణం మమః శ్లోకం మేలు చేస్తుంది.


తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    


ప్రారంభంలో వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధి కొరకు నూతన ప్రయత్నాలు, శ్రమ అనుకూలిస్తాయి. ఆ రీత్యా అధిక ఆదాయ విషయంలో ప్రణాళిక మార్చుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులు, పలుకుబడి కలిగిన వారి సహకారాన్ని వ్యాపార అభివృద్ధి విషయంలో, భాగస్వామితో కలిసి ఆశిస్తారు. భూమి, పెట్టుబడుల విషయంలో, సంతానము యొక్క అభివృద్ధి విషయంలో తీసుకునే నిర్ణయాలలో, ఊహించని ఖర్చులలో జాగ్రత్త అవసరము. మానసిక ప్రశాంతత కొరకు యోగ మెడిటేషన్ వంటివి అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలలో, ప్రయాణాలలో ఆటంకాలు, ఆలస్యాలు. వ్యక్తిగత ఆరోగ్యంలో, కుటుంబములోని స్త్రీలతో, గృహ వాతావరణం లోను శ్రద్ధ అవసరం. అమ్మవారి ఆరాధన, శ్లోకములు మేలు.


వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   


ప్రారంభములో ఆధ్యాత్మిక విషయాసక్తి. పుణ్యబలాన్ని పెంచుకోవడానికి, క్షేత్రసందర్శనకి ప్రయత్నాలు అనుకూలం. తండ్రితో, గురువుతో చర్చలు. ఉన్నత విద్యా ప్రణాళికలు. వృత్తిలో సహకారం ఆశించిన వ్యక్తుల నుంచి మిశ్రమం. ఉన్నత స్థాయి వ్యక్తులతో, పై అధికారులతో అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండాలి సమయాన్ని ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి, ముఖ్య వస్తువులకు కొనుగోలు, కుటుంబ సభ్యుల అవసరాలకు కేటాయిస్తారు. స్థిరాస్తుల విషయంలో దూర ప్రదేశాలలో ఉన్న బంధు వర్గముతో ఉద్వేగమైన చర్చలలో,ముఖ్యంగా వాహనాల విషయంలో స్థిర నిర్ణయానికి రావడంలో కన్ఫ్యూషన్ అధికం. శిరోవేదన, అధిక శ్రమ. భాగస్వామి సహకారం. దత్తాత్రేయుని శ్లోకాలు మేలు.


ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)


ప్రారంభంలో మార్పులు, ఖర్చులు అధికం. ఆరోగ్య విషయంలో, ముఖ్య అంశాలలో తీసుకునే నిర్ణయాలలో చేసే ప్రయత్నాలు, ప్రశాంతతలో చిన్నపాటి ఆటంకాలు. ఉన్నత విద్యలో రీసెర్చ్ స్కాలర్స్ కి అనుకూలతలు, మంచి గురువులభ్యం. శ్రమతో అనుకున్న పనులను సాధించుకుంటారు. తండ్రిగారి ఆరోగ్య, ఆధ్యాత్మిక విషయంలో సహకరిస్తారు. పరాక్రమం పెరుగుతుంది, స్థిరనిర్ణయాలు, భూ సంబంధ అంశాలు, తోబుట్టువులతో, సంతానముతో అనుకూలత. క్రీడాకారులకు, ప్రభుత్వరంగంలో ఉన్నవారికి మార్పులు, వ్యక్తిగత అభివృద్ధి. వృత్తిపరంగా బాధ్యతలు, నూతనఅవకాశాలు ఉన్నప్పటికీ కమ్యూనికేషన్, వ్యాపార విషయాలలో నిర్ణయాలలో తగిన జాగ్రత్తలు అవసరం. గృహవాతవర ణం, వాహన సౌఖ్యాలు, స్త్రీల సహకారం అనుకూలం. సత్యనారాయణస్వామి ఆరాధన, ఇష్టదేవత దేవాలయ సందర్శన మేలు. 


మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)


ప్రారంభంలో స్నేహసంబంధాలు, నూతన పరిచయాలు, భాగస్వామ్య వ్యవహారాలు, గుర్తింపు గౌరవం విషయాలలో అనుకూలతలు. కొత్త ప్రదేశాలలో ఆహార ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ముఖ్యమైన విషయాలలో ఆటంకాలు ఆలస్యాలు ఇబ్బంది కలిగిస్తాయి. జీవిత భాగస్వామి బంధువులతో చమత్కార వాదనలు, వీలైనంత వరకు ఉద్వేగపూరితమైన చర్చలను, అభిప్రాయ భేదములను అధిగమించాలి. మంచి ఉద్దేశంతో ఉన్నప్పటికీ అధిక ఆత్మవిశ్వాసంవల్ల, నాయకత్వ లక్షణాల వల్ల ఇతరుల అపార్థాలకు లోనయ్యే అవకాశాలు. ఉన్నత విద్య, భాగస్వామితో దూర ప్రయాణాలకు అవకాశం. సంతానానికి అభివృద్ధి. కృషి శీలత పెంచుకుంటారు. వృత్తిలో వ్యక్తుల సహకారం, సామర్థ్యంతో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకుంటారు. విఘ్నేశ్వరుని ఆరాధన, ఆలయ సందర్శన మేలు చేస్తుంది.


కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    


ప్రారంభంలో విద్యలో, పోటీలలోవిజయం సాధించడానికి విద్యార్థుల శ్రమఅధికం, రోగ నిరోధకశక్తి విషయంలో తగినఆహారం,వాకింగ్ మొదలైనవాటితో దినచర్యలో మార్పులు చేసుకుంటారు. న్యాయ సంబంధమైన విషయాలు కొంతమిశ్రమం. సాంఘిక సంబంధాలు, స్నేహవర్గంతో చర్చలు, గుర్తింపు గౌరవం మొదలైనవి నిలుపుకునేందుకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య, వృత్తి, రుణముల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వ్యక్తిగత విషయాలలో భావోద్వేగాలని, నాయకత్వ లక్షణాలని తొందరపాటునిర్ణయాలని వీలైనంతవరకు గమనించుకుంటూ, ఆత్మీయ సంబంధాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలి. వృత్తిపరమైన అంశాలలో పైఅధికారులతో, కొలీగ్స్ తో కమ్యూనికేషన్ విషయంలో మెళకువగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దలతో, ఆర్థిక విషయాల్లో అనుకూలం. వెంకటేశ్వరస్వామి దేవాలయ సందర్శన మేలు


మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)


ప్రారంభంలో మానసిక ప్రశాంతత, మంచి ఆలోచనలు, విందు వినోదాలు లో పాల్గొంటారు, సంతాన వర్గంతో అనుకూలత, ఉపాసన బలం, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం, విద్యార్థులకు విద్యా అంశాలలో వృద్ధి. సంతానం ఆరోగ్య విషయంలో, వారి విజయం కొరకు శ్రమ విషయంలో అవసరమైన వస్తువులు సమకూరుస్తారు. ఖర్చులు అధికం. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు, స్థిరాస్తుల కొరకు ఆలోచనలు, ప్రభుత్వపరమైన రుణముల కొరకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త పనులలో పరిచయం లేని వారిని నమ్మడం, రుణములు ఇవ్వడం, అనవసర ఖర్చులు అధిగమించాలి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, స్నేహ సంబంధాలలో ఆకస్మిక నిర్ణయాలు, మార్పులు చేస్తారు. నవగ్రహ ఆరాధన మేలు. 


(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).


 


 


డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani


జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant


email : padma.suryapaper@gmail.com


www.padmamukhi.com

Latest News
Pakistan must urgently reform or drift into 'managed decline' by 2031 Sun, Mar 01, 2026, 05:53 PM
'Khamenei's assassination may not ensure regime change, cause global economic fallout' Sun, Mar 01, 2026, 05:35 PM
Ayatollah Arafi named Iran's interim Supreme Leader Sun, Mar 01, 2026, 05:27 PM
TCS' market cap falls over Rs 18,000 crore last week Sun, Mar 01, 2026, 05:22 PM
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM