08.03.2026 నుండీ 14.03.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
 

by Suryaa Desk | Sun, Mar 08, 2026, 04:49 PM

మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)వారం ప్రారంభం ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది. మైత్రి బంధాలు అభివృద్ధి. శుభకార్యల్లో పాల్గొంటారు. తగిన గుర్తింపు గౌరవం, అనుకోని ఖర్చులు అధికం. స్థిరాస్తుల మార్పుల విషయంలో, ముఖ్యంగా భూసంబంధ వ్యవహారాలు పెద్దలతో నిర్ణయాలు, చర్చలు ఉపయుక్తముగా ఉంటాయి. ఆరోగ్య విషయం శ్రద్ధ అవసరం. ఉన్నత విద్యలో మంచి గురువు సహకారం, మార్గదర్శకత్వం లభ్యం. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలలో విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకుంటూ పట్టుదలతో ముందుకు సాగుతారు. వృత్తిపరంగా శ్రమ బాధ్యతలు అధికంగా ఉన్నప్పటికీ శ్రద్ధతో పనులు పూర్తి చేస్తారు. ఒత్తిడిని అధిగమించాలి. హనుమాన్ దేవాలయ దర్శన మంచిది.


వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  


ప్రారంభంలో శ్రద్ధతో తగిన శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు, తద్వారా గుర్తింపు గౌరవాన్ని లాభాన్ని పొందుతారు. ప్రత్యర్ధుల మీదవిజయ సాధన, రోగ నిరోధకశక్తి అనుకూలం. ఇష్టమైన హాబీల మీద దృష్టి కేటాయిస్తారు. స్త్రీలకు, ఆర్కిటెక్చర్, బ్యూటీషియన్ రంగంలోని వారికి, ఆర్థికంగా అనుకూలం. స్నేహితుల సహకారంతో ప్రయత్నాలలో విజయం,దూర ప్రదేశాలలో అవకాశం బాగుంటుంది. జీవిత భాగస్వామితో అనుకూల నిర్ణయాలు, కమ్యూనికేషన్ బాగుంటుంది. ఉత్సాహకరమైన ఆలోచనలతో వ్యాపార అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక మార్పులు. మధ్యలో అనవసర ఖర్చులు, ముఖ్యమైన పనుల వాయిదా. చివరికి పెద్దల సహకారంతో ఆశించిన పనులలో విజయం, లాభము సాధిస్తారు. దుర్గాదేవి ఆరాధన మేలు.


మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  


ప్రారంభంలో వృత్తిలో అభివృద్ధి,గౌరవం మానసిక ప్రశాంతత కొరకు, సంతాన విషయాలలో వారి భవిష్యత్తు ప్రణాళికల కొరకు, పెట్టుబడుల విషయాలు అధికంగా ఆలోచనలు. పెద్దల ఆరోగ్యం మీద దృష్టి సారిస్తారు. ఉపాసన ఆధ్యాత్మిక అంశాలలోఆటంకాలు.ఆత్మీయులతో సరళంగా మాట్లాడి తక్కువ శ్రమతో పనులు సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. రుణముల విషయంలో, ప్రత్యర్ధుల మీద విజయ సాధనలో ఘర్షణ అధికం. ఆశించిన ఉన్నత స్థాయి, పలుకుబడి కలిగిన పెద్దల సహకారం సామాన్యం. కుటుంబములోని పెద్దలతో ఉద్వేగ నిర్ణయాలను, చర్చలను అధిగమించాలి. సామరస్యంగా పనులు చేసుకోవాలి. భాగస్వామ్య వ్యవహారాలు, సాంఘిక సంబంధాలు, మైత్రి అనుకూలం. వారాంతంలో ఆర్థిక విషయాలు, వృత్తిపరమైన అధిక ఆదాయం అంశాల్లో, ముఖ్యమైన విషయాలులో ఆలస్యాలు కొంత చికాకును కలిగిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు


కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)


ప్రారంభంలో గృహ వాతావరణంలో భాగస్వామితో కలిసి చిన్నచిన్నమార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించి, గృహపకరణాల, వాహన అంశాలలోనూ చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న విషయాల్లో కీలక నిర్ణయాలు, మార్పులు. మానసిక ప్రశాంతత తక్కువ, సంతాన అభివృద్ధి, ఆరోగ్యము సంబంధించి చింత, ఆత్మీయులతో వాదోప వాదాలను, భావోద్వేగాలలో ఘర్షణలు అధిగమించాలి. వ్యతిరేక ఆలోచనలను ధ్యానము వంటి వాటితో పరిష్కరించుకోవాలి. దినచర్య, డైట్ లో మార్పులు, ఆరోగ్య విషయంలో శ్రద్ధ, ఖర్చులు. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. శత్రువులు ఇబ్బంది పెట్టినా నైపుణ్యంతో ముందుకు వెళతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం ఎంతోకాలంగా ఎదురుచూసిన అవార్డులు లాభిస్తాయి. స్నేహ సంబంధాలు వృద్ధి. విష్ణుమూర్తి ఆరాధన మేలు.


సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)


ప్రారంభంలో శ్రమ, బాధ్యత తో అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు వెళతారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం. ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ఖర్చులు అధికం. అది ఆనందాన్ని ఇస్తాయి. వ్యాపార విస్తరణ కొరకు పెట్టుబడులని ఆలోచిస్తారు. స్నేహ సంబంధాలలో కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రియమైన వ్యక్తులతో షాపింగ్ వంటి వాటికి అవకాశం. వాహనాలు, స్థిరాస్తులు వంటి వాటికి రిపేర్లఖర్చులు, క్రయ విక్రయాలు, తల్లితండ్రులతో చర్చలు. భాగస్వామి ఆరోగ్య విషయంలో, కుటుంబ ఆదాయ అంశాలలో శ్రద్ధ. సంతాన వర్గము కొరకు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. లాభపరమైన ఆలోచనలు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన, ఉపాసన బలం పెంచుకుంటారు. వారాంతంలో అధిక శ్రమతో సవాళ్లను ఎదుర్కొంటూ వృత్తిపరమైన పనులు నిర్వర్తిస్తారు. నిత్య జీవితంలో ఆకస్మిక మార్పులు. వెంకటేశ్వరస్వామి ఆరాధనమేలు.


కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)


ప్రారంభంలో ఆర్థిక విషయాలు,మాటవిలువ, కుటుంబగౌరవం అనుకూలం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఎదురు చూసిన వార్తలను అందుకుంటారు. తల్లి, భాగస్వామి సహకరిస్తారు. అనుకున్న లక్ష్యాలని సామర్థ్యంతో పూర్తిచేస్తారు. ధైర్యం, పరాక్రమం నిర్ణయ సామర్థ్యం, కమ్యూనికేషన్ బాగుంటాయి. తోబుట్టువులతో, తండ్రితో కలిసి చురుకుగా కుటుంబ సంబంధ నిర్ణయాలలో, వారసత్వ అంశాలలోనాయకత్వ లక్షణాలతో ముందుకువెళతారు. ముఖ్య విషయాలలో ఉన్నతస్థాయి, పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం. వృత్తి చేసే ప్రదేశాలలో శ్రమ అధికం, తగినవిధంగా కుటుంబ వ్యక్తుల సహకారంతో బకాయిపడ్డ పనులు పూర్తి చేసుకుంటారు. విందు వినోదాలు, స్నేహితుల కలయిక కొరకు ప్రయత్నాలు చేస్తారు, అయినప్పటికీ ముఖ్య విషయాల్లో తీసుకునే నిర్ణయాలలో ఆలస్యాలు ఆటంకాలు ఆత్మీయులతో ఘర్షణను పెంచే అవకాశం, అనవసర ఆందోళనను అధిగమించాలి. దేవి ఆరాధన, శ్లోకములు మేలు చేస్తుంది.


తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    


వారం ప్రారంభం ఉత్సాహంతో వృత్తిలో అభివృద్ధి కోసం కొత్త నిర్ణయాలు, సిబ్బంది సహకారం తో సమావేశాలు నిర్వహించి మంచి చర్చలు చేస్తారు. అధికశ్రమ ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ముఖ్యముగా కంప్యూటర్, ఇంటర్నెట్ అధికముగా వాడటంవల్ల కంటి సంబంధ అనారోగ్యాలు. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా స్త్రీలతో ఘర్షణలు అధిగమించాలి. రోగనిరోధక శక్తి విషయంలో, వ్యక్తిగత శ్రద్ధలో వాయిదాలు తగవు. వ్యాపార భాగస్వామ్య అంశాలలోనూ మాటలవల్ల అపార్థాలకు అవకాశం, తక్కువ మాట్లాడడం మేలు. అధిక ఎమోషన్స్ తోకూడిన తొందరపాటు నిర్ణయాలు తగవు. సామర్థ్యంతో, పెద్దలసహకారంతో, ఆశీస్సులతో ముఖ్యమైన పనులను నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక పర్యటనలకి, దూర ప్రయాణాలకు అవకాశం. వారాంతంలో వృత్తిలో, గృహ సంబంధ అంశాలలో కీలక మార్పులు, వాహనాలకు సంబంధించి, డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. విద్యార్థుల శ్రమతో ముందుకు వెళతారు. ఆదిత్య హృదయ పారాయణ మేలు


వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   


ప్రారంభంలో, సంతానానికి, వాహన సంబంధ ఆకస్మిక ఖర్చులు అధికం, భాగస్వామి వృత్తి సంబంధ సహకారంలో అధిక సమయాన్ని కేటాయిస్తారు. నిద్రలేమి శ్రమ ఒత్తిడిని అధిగమించాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. డ్రైవింగ్ లో తగిన జాగ్రత్తలు అవసరం. భూమి, స్థిరాస్తులు మోసానికి గురికాకుండా సలహా కొరకు దూర ప్రదేశాలలో ఉన్న దగ్గర బంధువులతో చర్చలు నిర్ణయానికి వస్తారు. వృత్తిలో ఉన్నతస్థాయి వ్యక్తులతో ఆకస్మిక ఘర్షణలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరించి అధిగమించగలరు. రాబడిని మించిన ఖర్చులు, ప్రణాళికపరంగా వెచ్చించడం మంచిది. వాగ్దానాలలో ఆలస్యాలు. సామర్థ్యంతో క్రింద సిబ్బంది సహకారంతో పనులను ఆలస్యంగా సాధిస్తారు. కృష్ణుని ఆరాధన మేలు


ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)


ప్రారంభంలో ఆకస్మిక లాభాలు, ఎదురు చూసిన వర్తమానాలు, అనుకోని ఖర్చులు. గృహ స్థిరాస్తుల కొరకు ప్రణాళికలు. వాహన కొనుగోలు వ్యవహారాలు, ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. అధిక శ్రమ ఒత్తిడి నిద్రలేమి, తగిన విశ్రాంతి, ఆహార స్వీకరణ అవసరం. పూర్వం ఇచ్చిన బకాయిలని కొంతవరకు పొందగలుగుతారు. సామర్థ్యాన్ని ఉపయోగించి వ్యక్తుల సహకారంతో వృత్తిపరమైన నూతన అవకాశాలు అభివృద్ధి. వ్యాపార వ్యవహారాల్లో, భాగస్వామ్య విషయాల్లో కమ్యూనికేషన్ లో తగిన జాగ్రత్తల అవసరం. సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది, వ్యక్తిగత ఖర్చు. వాగ్దానాలు నిలబెట్టు కోవడంలో జాగ్రత్త అవసరం. బాలాజీ మందిరాలు దర్శించడం మేలు.


మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)


వృత్తిపరమైన విషయాలలో నూతన వ్యక్తుల పరిచయం. స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి కొరకు కుటుంబ సభ్యులతో చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం అనుకూలం, ఆశించిన విషయాలలో అభివృద్ధి. ఎదురుచూసిన వర్తమానాలు అనుకూలిస్తాయి. గృహముపై ఆదాయం అందుకుంటారు. స్థిరాస్తుల విషయాలలో, ముఖ్యంగా రుణముల కొరకు చేసే ప్రయత్నాలలో మాటలవల్ల ఇబ్బందులు, అపార్ధాలు రాకుండా, తగిన జాగ్రత్త అవసరం. దంత ఆరోగ్యము, తీసుకునే ఆహారాల అంశంలో ఆచితూచి ముందుకెళ్లాలి. విదేశీ ప్రయాణాల వ్యవహారాలు మీద దృష్టి సారిస్తారు. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. గణేశుని ఆరాధన మేలు.


కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    


ప్రారంభంలో విద్యార్థులు అధిక శ్రమతో పట్టుదలతో ముందుకు వెళ్లడానికి ప్రయత్నాలు. ఆర్థిక విషయాలు అనుకూలం తల్లిదండ్రుల సహకారం. ముఖ్యమైన పనులు ఆలస్యాలు ఆటంకాలు. రుణముల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. వృత్తి చేసే ప్రదేశాలలో పై అధికారులతో, కొలీగ్స్ తో అపార్ధాలను అధిగమించాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు. అధిక ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలని సరి చూసుకుంటూ ముందుకు వెళ్లాలి. నూతన వృత్తుల కొరకు దూర ప్రదేశాలలో ప్రయత్నాలు, కష్టాన్ని తగినట్లుగా ఒక సమాచారం ఆనందాన్నిస్తుంది. సంతానము అభివృద్ధి. వృత్తిపరమైన ఒత్తిడి అధికం, ఆర్థిక అనుకూలతలు కుటుంబ ఖర్చులు, పెద్దల ఆరోగ్య శ్రద్ధ. ఈశ్వరుని ఆరాధన మేలు.


మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)


ప్రారంభంలో మానసిక ప్రశాంతత తక్కువ. ఆరోగ్య శ్రద్ధ అవసరం. సంతానం అభివృద్ధి కొరకు ఖర్చులు. అనవసర వ్యతిరేక ఆలోచనలని ధ్యానం ద్వారా, ఆత్మీయులైన వారితో చర్చించి అధిగమించాలి. కుటుంబ పెద్దలతో, ఆర్థిక అంశాలని, చర్చిస్తారు. వృత్తిలో శ్రమ నూతన బాధ్యతలు అధికంగా ఉన్నప్పటికీ, అభివృద్ధి గౌరవానికి అవకాశం, అధిక ఉద్వేగాలకి దూరంగా ఉండాలి. వృధా ప్రయాణాలు, సౌకర్య లోపం చికాకు కలిగిస్తుంది. వారాంతంలో ఆశించిన విషయాలలో కొలతలు ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్లడం సంతాన సహకారం ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విష్ణు సహస్రనామాలు వినడం మేలు. 


(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).


 


 


డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani


జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant


email : padma.suryapaper@gmail.com


www.padmamukhi.com

Latest News
PM Modi to visit Karnataka, Telangana tomorrow; to launch projects worth Rs 9,400 crore Sat, May 09, 2026, 01:42 PM
Chotrani beats Abhay in World Squash Championships opener Sat, May 09, 2026, 12:58 PM
Indian seafarer killed after ship catches fire, sinks near Strait of Hormuz Sat, May 09, 2026, 12:56 PM
Emergency restoration of millennium-old temple completed in Cambodia's Angkor complex Sat, May 09, 2026, 12:56 PM
TTV Dhinakaran alleges fake support letter from his MLA; demands probe into 'horse-trading' bid by TVK Sat, May 09, 2026, 12:54 PM