అనకాపల్లి జిల్లా చోడవరంలో భారీ చోరీ,,, 65 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
 

by Suryaa Desk | Sun, Mar 08, 2026, 06:05 PM

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రెండు చోట్ల జరిగిన దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరంలో భారీ చోరీ జరిగింది. ఓ మహిళ ఇంట్లో చొరబడిన దొంగలు.. ఏకంగా కోటిన్నర రూపాయల సొత్తు చోరీ చేశారు. చోడవరం మండలంలోని గోవాడలో ఈ ఘటన జరిగింది. గోవాడలోని బీఎన్ రోడ్డు పక్కనే సుజాత అనే మహిళ నివసిస్తున్నారు. అయితే తన ఇంట్లోని 65 తులాల బంగారం, నగదు చోరీ జరిగిందని సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు బంగారంతో పాటుగా, డబ్బులు కూడా చోరీ చేశారని సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన మొత్తం సొత్తు విలువ కోటిన్నర రూపాయల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. ఘటనాస్థలిని పరిశీలించిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. అయితే ఇంత పెద్దమొత్తంలో బంగారం చోరీ కావటం స్థానికంగా కలకలం రేపుతోంది.


మరోవైపు విశాఖపట్నంలోని పీఎం పాలెంలోనూ బంగారం చోరీ జరిగింది పెద రుషికొండ వద్ద ఉన్న ఓ అపార్టుమెంటులో ఈ ఘటన జరిగింది. కొంతమంది దొంగలు అపార్టు‌మెంట్లోకి ప్రవేశించి బంగారం చోరీ చేశారు. పీఎం పాలెం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం. వీరవెంకట శ్రీనివాసరావు అనే రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. శ్రీనివాసరావు భార్యతో కలసి పెద రుషికొండలోని ఓ అపార్టుమెంట్‌లో నివసిస్తున్నారు. గురువారం రాత్రి శ్రీనివాసరావు, ఆయన భార్య నిద్రపోతున్న సమయంలో.. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం ఓ గదిలోకి వెళ్లి.. కబోర్టులో ఉన్న ఏడు తులాల బంగారం చోరీ చేశారు.


శుక్రవారం రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత శ్రీనివాసరావు దంపతులు తమ ఇంట్లో దొంగలుపడిన విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్‌టీమ్‌తో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఆధారాలు సేకరించారు. బాధితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. చోరీ ఘటనపై దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. అయితే ఈ ఘటన మరువకముందే అనకాపల్లి జిల్లాలో బంగారం చోరీ ఘటన వెలుగు చూసింది. అనకాపల్లి జిల్లాలో ఏకంగా 65 తులాల బంగారం చోరీ కావటంతో.. బంగారం ఇంట్లో ఉన్న సంగతి తెలిసే ఎవరో చోరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు రెండు ఘటనలపై దర్యాప్తు జరుపుతున్నారు.

Latest News
Shiv Sena (UBT) calls for end to political protection of corrupt leaders Sat, May 09, 2026, 11:36 AM
Two killed in US military strike on 'drug boat' in Pacific Sat, May 09, 2026, 11:03 AM
'New dawn of trust': Nitin Nabin ahead of BJP govt formation in Bengal Sat, May 09, 2026, 10:48 AM
Messi backs Neymar for World Cup return Sat, May 09, 2026, 10:39 AM
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM