రూ.6300 కోట్లకు దాటిన సుందర్ పిచాయ్ జీతం
 

by Suryaa Desk | Sun, Mar 08, 2026, 08:02 PM

ప్రపంచ టెక్ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన భారత సంతతి వ్యక్తి, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంపాదన విషయంలో సరికొత్త రికార్డు సృష్టించారు. గూగుల్ మాతృ సంస్థ 'ఆల్ఫాబెట్' తన అధినేతకు కళ్లు చెదిరే రీతిలో వేతన ప్యాకేజీని సవరించింది. వచ్చే మూడేళ్ల కాలానికి ఆయనకు ఏకంగా 692 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 63,617 కోట్లు) అందే అవకాశం ఉందని 'ఫైనాన్షియల్ టైమ్స్' నివేదిక వెల్లడించింది. దీనితో ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా పిచాయ్ నిలిచారు.


ప్యాకేజీ పూర్తి వివరాలివే..!


ఈ భారీ ప్యాకేజీ అంతా నేరుగా నగదు రూపంలో రాదు. అయితే ఇందులో మెజారిటీ వాటా షేర్ల రూపంలో ఉంటుంది. సుమారు 126 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఆయనకు కేటాయించారు. ఒకవేళ కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలను మించి రాణిస్తే.. ఇవి రెట్టింపు అయ్యి 252 మిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. అలాగే ఏడాదికి సుమారు 2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 16.5 కోట్లు) బేసిక్ శాలరీగా లభిస్తుంది. గూగుల్ అనుబంధ సంస్థలైన 'వేమో' (అటానమస్ డ్రైవింగ్), 'వింగ్' (డ్రోన్ డెలివరీ) వంటి భవిష్యత్తు ప్రాజెక్టుల పురోగతిని బట్టి మరో 350 మిలియన్ డాలర్ల విలువైన ఇన్సెంటివ్‌లు లభిస్తాయి.


 పిచాయ్ హయాంలో గూగుల్ ప్రస్థానం


2015లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటికి గూగుల్ మార్కెట్ విలువ 535 బిలియన్ డాలర్లు మాత్రమే. కానీ పిచాయ్ తన అద్భుతమైన నాయకత్వంతో దీనిని ఏకంగా 3.6 ట్రిలియన్ల డాలర్లకు అంటే సుమారుగా 7 రెట్లు పెంచారు. ఈ ఏడాది జనవరిలో ఇది ఒక దశలో 4 ట్రిలియన్ డాలర్ల మార్కును కూడా తాకింది. ఆయన కృషితోనే గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ వంటి విభాగాలు ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచాయి.


పోటీదారుల కంటే ఎంతో ముందు..


ప్రస్తుత టెక్ ప్రపంచంలో ఇతర దిగ్గజ సీఈఓలతో పోలిస్తే పిచాయ్ ప్యాకేజీ అత్యంత భారీగా ఉంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 2025 ఆర్థిక సంవత్సరంలో 96.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 800 కోట్లు) అందుకోగా.. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్యాకేజీ 74.3 మిలియన్ డాలర్ల వద్ద ఉంది. అంటే పిచాయ్ వీరి కంటే చాలా రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారన్నమాట. ప్రస్తుతం పిచాయ్ దంపతుల వద్ద గూగుల్‌కు చెందిన సుమారు 1.67 మిలియన్ల షేర్లు ఉన్నాయి. వీటి ప్రస్తుత విలువ సుమారు 498 మిలియన్ల్ డాలర్లగా (రూ. 4,100 కోట్లు) అంచనా. చూడాలి మరి మున్ముందు మరెంత జీతం అందుకుంటారనేది.


Latest News
MP govt orders mass rabies vaccination after guests consume infected 'chhas' Fri, May 08, 2026, 11:57 AM
Cloudflare to cut over 1,100 jobs amid AI-led restructuring Fri, May 08, 2026, 11:56 AM
Four arrested for plotting Bengaluru woman's murder by staging accident Fri, May 08, 2026, 11:53 AM
Bihar Cabinet expansion: Ministers take charge; NDA leaders emphasise unity, development focus Fri, May 08, 2026, 11:51 AM
Hardcore criminal of Dev Kalyanpuri gang arrested under 'Operation Gang Bust'; illegal firearm, live cartridges recovered Fri, May 08, 2026, 11:46 AM