టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో భారత్ భారీ స్కోరు,,,,హాఫ్ సెంచరీలు కొట్టిన అభిషేక్, సంజూ, ఇషాన్
 

by Suryaa Desk | Sun, Mar 08, 2026, 09:57 PM

టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో భారత్.. న్యూజిలాండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. హాఫ్ సెంచరీలు స్కోరు చేశారు.


ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన భారత్.. ధాటిగా బ్యాటింగ్ చేసింది. అభిషేక్ శర్మ.. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో సత్తాచాటాడు. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి.. జట్టుకు శుభారంభాన్ని అందించాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన తర్వాత.. అతడు ఔట్ అయ్యాడు. సంజూ, అభిషేక్ తొలి వికెట్‌కు 43 బంతుల్లో 98 పరుగులు జోడించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. అభిషేక్ నుంచి బాధ్యతలు తీసుకున్నాడు. అతడు కూడా బ్యాట్ ఝుళిపించాడు.


మరోవైపు సంజూ శాంసన్ కూడా వరుసగా మూడో మ్యాచులో హాఫ్ సెంచరీ కొట్టాడు. 46 బంతుల్లో 89 పరుగులు స్కోరు చేశాడు. ఇషాన్ కిషన్ కూడా.. 25 బంతుల్లో 54 రన్స్ చేశాడు. దీంతో టీమిండియా ఓ దశలో 270 రన్స్ చేసేలా కనిపించింది. కానీ జేమ్స్ నీషమ్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి.. స్కోరును కట్టడి చేశాడు. సంజూ శాసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వరుస బంతుల్లో ఔట్ అయ్యారు. కానీ చివర్లో శివమ్ దూబె.. మంచి ఫినిష్ ఇచ్చాడు. 8 బంతుల్లో 26 రన్స్ చేసి మంచి ముగింపు ఇచ్చాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.


టీ20 ప్రపంచకప్‌లో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్లు ఇవే..


92/0 - భారత్ vs న్యూజిలాండ్, 2026


92/1 - వెస్టిండీస్ vs అప్ఘానిస్థాన్,2024


91/1 - నెదర్లాండ్స్ vs ఐర్లాండ్, 2014


89/3 - ఇంగ్లాండ్ vs సౌతాఫ్రికా, 2016


86/1 - భారత్ vs నమీబియా, 2026

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM