1914 క్యాలెండర్ మళ్లీ కనిపించిన 2026.. ప్రపంచానికి హెచ్చరికా?
 

by Suryaa Desk | Mon, Mar 09, 2026, 09:15 PM

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా–ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులు చేయడం వంటి పరిణామాలను కొంతమంది విశ్లేషకులు 1914 సంవత్సరంతో పోల్చుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అప్పటి పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన 1914 సంవత్సరంలోని క్యాలెండర్ నమూనా 2026లో కూడా రిపీట్ అవుతుందని కొందరు పేర్కొంటున్నారు. ఈ అంశంపై చరిత్ర మళ్లీ పునరావృతమవుతుందా అనే ప్రశ్నతో ఆన్‌లైన్‌లో పలు సిద్ధాంతాలు, ఊహాగానాలు, చర్చలు సాగుతున్నాయి.1914 మరియు 2026 సంవత్సరాల మధ్య కొన్ని ఆసక్తికరమైన పోలికలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ రెండు సంవత్సరాలు కూడా లీప్ ఇయర్స్ కావు. అలాగే రెండూ గురువారం రోజునే ప్రారంభమయ్యాయి. అందువల్ల రెండు సంవత్సరాల్లో కూడా ప్రతి తేదీ అదే వారంలో వస్తుంది. ఉదాహరణకు 1914 జనవరి 1 గురువారం వచ్చినట్లే, 2026 జనవరి 1 కూడా గురువారమే వచ్చింది. గణితపరంగా చూస్తే ఇలాంటి యాదృచ్ఛికాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌లో అప్పుడప్పుడూ కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.అయితే 1914 సంవత్సరం మానవ చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన యుద్ధానికి నాంది పలికిన సంవత్సరం కావడంతో ఈ పోలికలు ఇప్పుడు కొందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. 1914 జూన్ 28న ఆస్ట్రియా–హంగేరీకి చెందిన ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ సారాజేవో నగరంలో హత్యకు గురయ్యాడు. ఆ సంఘటన మొదట ప్రాంతీయ సంక్షోభంగా ప్రారంభమైనా, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులకు దారితీసింది. వరుసగా జరిగిన యుద్ధ ప్రకటనలతో పరిస్థితి మరింత తీవ్రంగా మారి మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది పలికింది. దాదాపు నాలుగు సంవత్సరాలు కొనసాగిన ఈ యుద్ధంలో ప్రపంచంలోని ప్రధాన దేశాలు పాల్గొన్నాయి. చరిత్రకారుల అంచనాల ప్రకారం ఈ యుద్ధంలో సుమారు రెండు కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. 1914 మరియు 2026 సంవత్సరాల క్యాలెండర్లు ఒకే విధంగా ఉన్నందున, అప్పటిలాగే ఈ ఏడాదిలో కూడా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం తలెత్తే అవకాశముందని కొందరు పేర్కొంటున్నారు.అయితే ఈ పోలికలు పూర్తిగా గణితశాస్త్ర సంబంధమైనవే అని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గ్రెగోరియన్ క్యాలెండర్ వ్యవస్థలో కొన్ని సంవత్సరాల్లో తేదీలు, వారాలు ఒకే విధంగా ఉండే అవకాశం ఉంటుందని, అందువల్ల ఇలాంటి సారూప్యతలు అసాధారణమైనవి కావని వారు తెలిపారు.ఇదిలా ఉండగా గత సంవత్సరంలో కూడా ఇదే తరహా చర్చలు జరిగాయని నెటిజెన్లు గుర్తు చేస్తున్నారు. 2025 క్యాలెండర్ కూడా రెండో ప్రపంచ యుద్ధం కాలానికి చెందిన 1941 సంవత్సరంలోని క్యాలెండర్‌తో పోలికలు ఉన్నాయని అప్పట్లో చర్చించుకున్నారు.

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM