చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా కాపాడే చిట్కాలు
 

by Suryaa Desk | Mon, Mar 09, 2026, 10:51 PM

జుట్టు చిన్న వయసులోనే తెల్లబడటం అనేది ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. నిండా ముప్పై ఏళ్లు నిండకముందే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు. ఇందుకు వంశపారంపార్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, జీవనశైలి అలవాట్లు వంటి కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని డాక్టర్ సూర్య ఎస్, కన్సల్టెంట్ - డెర్మటాలజీ (స్పార్ష్ హాస్పిటల్, హెన్నూర్ రోడ్, బెంగళూరు) తెలిపారు.


ఇక, తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ నుంచి నేచురల్ రెమిడీస్ వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా సరైన ఫలితం ఉండదు. చిన్న వయసులోనే జుట్టు తెల్లపడటానికి కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలు గురించి డాక్టర్ సూర్య ఎస్ తెలిపారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ రోజుల్లొ జుట్టు నెరవడం చాలా సాధారణం అయిపోతోంది. 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల యువత తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య వృద్ధాప్యం వల్ల మాత్రమే కాదు. ఒత్తిడి, జీవనశైలి అలవాట్లు సరిగా లేకపోవడం, జన్యు లోపం, పోషకాహార లోపం వల్ల కూడా వస్తుంది.​ చిన్న వయసులోనే తెల్ల జుట్టు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


డాక్టర్ సూర్య ఎస్, కన్సల్టెంట్ - డెర్మటాలజీ.


చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది?


​మన జుట్టుకు మెలనిన్ అనే పిగ్మెంట్ రంగు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు జుట్టు తెల్లగా మారుతుంది. దీనికి ప్రధాన కారణాలు:


​వంశపారంపర్యం: మీ ఇంట్లో తల్లిదండ్రులకు లేదా ఇంట్లో ఎవరికైనా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడితే, మీకు కూడా అలా జరిగే అవకాశం ఉంది.


పోషకాహార లోపం: శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందకపోవడం వల్ల కూడా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉంటుంది.


​ఒత్తిడి: ఈ రోజుల్లో చాలా మంది వర్క్ లైఫ్‌స్టైల్, చదువుల కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. విపరీతమైన పని ఒత్తిడి లేదా మానసిక ఆందోళన వల్ల శరీరంలోని కణాలు దెబ్బతిని జుట్టు రంగు మారుతుంది.


​ఇతర అనారోగ్య సమస్యలు: థైరాయిడ్ సమస్యలు లేదా రోగనిరోధక శక్తికి సంబంధించిన సమస్యలు కూడా జుట్టు తెల్లపడటానికి కారణాలు.


చిన్న వయసులోనే జుట్టు తెల్లబడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు


సరైన ఆహారం


జుట్టు ఆరోగ్యానికి లోపలి నుంచి పోషణ అందడం చాలా ముఖ్యం. ముఖ్యంగా విటమిన్ బి12, ఐరన్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యం.


విటమిన్ బి12: దీని లోపం వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం జరుగుతుంది. ఇది జుట్టుకు రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా జుట్టు రంగు కోల్పోతుంది. విటమిన్ బి12 రోలం పాలు, పెరుగు, గుడ్లు, మాంసం వంటి వాటిని మీ డైట్‌లో భాగం చేసుకోండి.


ఐరన్, కాపర్: ఈ రెండూ పోషకాల లోపం వల్ల చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావచ్చు. అందుకే ఇవి ఎక్కువగా ఉండే ఆకుకూరలు (పాలకూర), జీడిపప్పు, బాదంపప్పు వంటి డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు తీసుకోవాలి. కాపర్ మెలనిన్ ఉత్పత్తికి చాలా అవసరం.


​యాంటీ ఆక్సిడెంట్స్: బెర్రీలు, గ్రీన్ టీ, ఉసిరి, తాజా పండ్లు వంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి జుట్టును రక్షిస్తాయి.


జీవనశైలి మార్పులు


ఒత్తిడి తగ్గించుకోవడం: ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడిని తగ్గించుకుంటే చాలా సమస్యల్ని దూరం పెట్టొచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం లేదా మీకు నచ్చిన ఏదైనా పని ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.


ధూమపానం మానేయండి: ఈ రోజుల్లో చాలా మందికి స్మోకింగ్ అలవాటు ఉంది. సిగరెట్ తాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి.. జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ తగ్గి తెల్లబడుతుంది. అందుకే స్మోకింగ్ అలవాటుకు గుడ్ బై చెప్పేయండి.


తగినంత నిద్ర చాలా ముఖ్యం: చాలా మందిని నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే కీలకం. రోజుకు 7 - 8 గంటల గాఢ నిద్ర జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


తగినంత నీరు తాగడం: నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. జీవక్రియ విధులకు నీరు తాగడం చాలా కీలకం. రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగండి.


జుట్టు సంరక్షణ 


కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ తగ్గించండి: ఎక్కువగా రసాయనాలు ఉండే షాంపూలు, హెయిర్ డైలు, బ్లీచింగ్ వాడటం తగ్గించాలి. వీలైనంత వరకు సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూల్ని వినియోగించండి.


జుట్టుకు వేడిని తగ్గించండి: హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిటనర్లు ఎక్కువగా వాడటం వల్ల జుట్టు బలహీనపడి రంగు కోల్పోతుంది. ఈ మెషీన్లు వాడటం వల్ల ఎక్కువ వేడి ఉత్పత్తి అయ్యి జుట్టు దెబ్బతింటుంది.


సహజ నూనెలు: కొబ్బరి నూనె లేదా బాదం నూనెలో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.


కెమికల్ డైలు : అమ్మోనియా ఎక్కువగా ఉండే హెయిర్ కలర్స్ వాడటం వల్ల ఉన్న నల్ల జుట్టు కూడా తెల్లబడే అవకాశం ఉంది.


వేడి నీళ్లు: తల స్నానానికి మరీ వేడిగా ఉండే నీటిని వాడకండి. గోరువెచ్చని నీరు లేదా చల్లని నీటితో తలస్నానం చేయడం ఉత్తమం.


​ముఖ్యమైన గమనిక


ఒకవేళ మీరు కూడా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతుంటే అది కేవలం వయసు వల్ల వచ్చే మార్పు కాకపోవచ్చు. శరీరంలో ఏదైనా తీవ్రమైన విటమిన్ లోపం ఉందేమో తెలుసుకోవడానికి ఒకసారి డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించడం ఉత్తమం. వారు రక్త పరీక్షల ద్వారా అసలు కారణాన్ని గుర్తించి సరైన మందుల్ని, పాటించాల్సిన జాగ్రత్తలు సూచిస్తారు.


Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM