ముస్లింలకు న్యాయం చేసింది అప్పుడు వైయస్సార్ తర్వాత జగన్ మాత్రమే
 

by Suryaa Desk | Wed, Mar 11, 2026, 09:53 AM

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు అసత్య ప్రచారాలే తప్ప ఆచరణలో ఆయన చేసింది ఏమీలేదని నగర మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, టీడీపీ నేతలు నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో మైనార్టీలకు ఏమీ చేయలేదని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదమన్నారు. అసత్య ప్రచారాలు చేయడం దగ్గుపాటి ప్రసాద్‌కు అలవాటైందని విమర్శించారు.దివంగత ముఖ్యమంత్రి  వైయ‌స్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన 4 శాతం రిజర్వేషన్ల వల్లే ముస్లిం యువత విద్య, వైద్య రంగాల్లో ముందుకు వచ్చారని వసీం తెలిపారు. అలాగే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి మైనార్టీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపును కల్పించారని పేర్కొన్నారు.వైయ‌స్ జగన్ ప్రభుత్వం ఇమామ్‌లకు రూ.10 వేల గౌరవ వేతనం, మౌజమ్‌లకు రూ.5 వేల గౌరవ వేతనం, హజ్ యాత్రకు రూ.లక్ష ఆర్థిక సహాయం, హజ్ ఆస్తుల పరిరక్షణ వంటి చర్యలు చేపట్టిందన్నారు. అదేవిధంగా సుమారు రూ.23 వేల కోట్లతో సంక్షేమ పథకాల ద్వారా మైనార్టీ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిందని చెప్పారు. పేద ముస్లిం యువతుల వివాహాలకు రూ.లక్ష ‘షాదీ తోఫా’ అందజేసినట్లు గుర్తుచేశారు.ముస్లింలపై ప్రేమ ఉందని ఎమ్మెల్యే చెప్పడం కేవలం మాటలకే పరిమితమని, వాస్తవానికి ముస్లింలను రాజకీయంగా దెబ్బతీయడం, వారిపై దాడులు జరగడం వంటి ఘటనలు జరుగుతున్నాయని వసీం ఆరోపించారు. 

Latest News
Wood gives Forest first-leg advantage in Europa League SF Fri, May 01, 2026, 10:44 AM
Kiren Rijiju hails warm welcome in North Sikkim Fri, May 01, 2026, 10:39 AM
'Dynamic, enterprising nature of people noteworthy': PM Modi on Gujarat Day Fri, May 01, 2026, 10:17 AM
Kailash Kher invokes Lord Shiva with 'Bam Lahiri' at Kedarnath Fri, May 01, 2026, 10:14 AM
South Korea and Australia agree to enhance cooperation on stable energy supplies Thu, Apr 30, 2026, 04:38 PM