రైతులకి ఉపయోగపడే చెరువుల మరమత్తులకి ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదు?
 

by Suryaa Desk | Thu, Mar 12, 2026, 10:52 AM

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టుతున్నార‌ని మాజీ మంత్రి పేర్ని నాని విమ‌ర్శించారు.  ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లలో 3,31,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడితే, కూటమి ప్రభుత్వం కేవలం 22 నెలల్లోనే 3,33,321 కోట్ల రూపాయల అప్పులు చేసింది. ప్రతిపక్షాలు అప్పులపై అడుగుతున్న ప్రశ్నలకి ఇప్పటి వరకు కూటమి నాయకులు స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన అన్నారు. రైతులు తమ చెరువుల మరమ్మత్తులు చేసుకోవడానికి ప్రయత్నించినా అధికారులు అడ్డుపడుతున్నారు. సొలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంటే జిల్లా కలెక్టర్ ద్వారా సమన్వయం అవసరం, కానీ ఇప్పటివరకు అధికారులకు సమాచారం రాలేదు. చిన్న సన్నకారు రైతుల సాధారణ హక్కులను కూడా పాటించనివ్వడం వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.రెవిన్యూ అధికారులు రాజకీయ నాయకుల వంత పాడే పనులు చేస్తే రైతులు ఎవరికి చెప్పాలో తెలియదని చెప్పారు. త్వరలో సమస్యలు పరిష్కారం కాకపోతే, రైతులతో కలసి  రెవిన్యూ కార్యాలయంపై ముట్టడి చేయడానికి, అవసరమైతే జైళ్లను నింపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

Latest News
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM