యుద్ధం ఆపేందుకు షరతులు విధించిన ఇరాన్
 

by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:09 PM

అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న ఘర్షణకు ముగింపు పలకడానికి ఇరాన్ మూడు కీలక షరతులను ముందుకు తెచ్చింది. ఒకవైపు శాంతి కోసం ప్రతిపాదనలు చేస్తూనే, మరోవైపు తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ దేశ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఈ షరతులను ప్రకటించారు. రష్యా, పాకిస్థాన్ దేశాధినేతలతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్, అమెరికా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ముగించాలంటే ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో తమ దేశంపై మళ్లీ దాడులు జరగకుండా కఠినమైన అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మూడు షరతులకు అంగీకరిస్తేనే శాంతి సాధ్యమని ఆయన తేల్చిచెప్పారు.

Latest News
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM