రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంలో వైసీపీ తరపున పోరాటాన్ని కొనసాగిస్తాం
 

by Suryaa Desk | Thu, Mar 12, 2026, 03:20 PM

వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకొని  వైసీపీ పార్టీ ఎంపీలు న్యూఢిల్లీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సంవిధాన్ స‌ద‌న్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ఎంపీలు పునరుద్ఘాటించారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయకత్వంలో ప్రజలతో కలిసి నిలబడి రాష్ట్ర హక్కుల సాధన కోసం కృషి చేస్తామని  తెలిపారు. భవిష్యత్తులో కూడా పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబూరావు, డాక్ట‌ర్ త‌నుజారాణి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest News
Bengal records 61.18 pc voter turnout, TN touches 56 pc mark Thu, Apr 23, 2026, 02:12 PM
Centre boosts MSP procurement in Chhattisgarh, launches structured pulse procurement in Bihar Thu, Apr 23, 2026, 01:50 PM
India emerging as new global centre of gravity: Report Thu, Apr 23, 2026, 01:45 PM
Justice after 40 years: Delhi Crime Branch arrests absconder in 1986 murder case Thu, Apr 23, 2026, 01:44 PM
TN polls: Newlyweds step out to vote, ECI highlights spirit of active citizenship Thu, Apr 23, 2026, 01:14 PM